Imran Khan : ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇమ్రాన్ ఖాన్
బుల్లెట్ గాయాలతో శస్త్రచికిత్స చేయించుకున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్..
- By Prasad Published Date - 06:48 AM, Mon - 7 November 22

బుల్లెట్ గాయాలతో శస్త్రచికిత్స చేయించుకున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదివారం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. నగరంలోని తన ప్రైవేట్ నివాసానికి తరలించారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్‌లోని వజీరాబాద్ ప్రాంతంలో అతను షెహబాజ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు ముష్కరులు ఆయనపై కాల్పులు జరపడంతో కుడి కాలికి బుల్లెట్ గాయాలయ్యాయి. రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఖాన్ ఫిట్‌గా ఉండాలంటే కనీసం కొన్ని వారాల విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు.