IIT Hyderabad: ఫీజుల పెంపుపై మండిపడుతున్న హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు
హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫీజుల పెంపుపై అధికార యంత్రాంగం ఉదాసీనతకు వ్యతిరేకంగా హైదరాబాద్
- Author : Praveen Aluthuru
Date : 06-07-2023 - 4:55 IST
Published By : Hashtagu Telugu Desk
IIT Hyderabad: హైదరాబాద్ ఐఐటీ విద్యార్దులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఫీజుల పెంపుపై అధికార యంత్రాంగం ఉదాసీనతకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పీహెచ్‌డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. 200 మందికి పైగా ప్రజలు ఇన్స్టిట్యూట్ బయటకు వచ్చి తమ గళాన్ని విప్పారు. జూన్ నుండి ఫీజు పెంపుపై నిర్వాహకులకు వినతులు పంపినప్పటికీ స్పందించలేదని విద్యార్థులు వాపోయారు.
2018లో ఒక సెమిస్టర్‌కు రూ.40,000 చెల్లించిన పీహెచ్‌డీ స్కాలర్‌లు ఇప్పుడు సెమిస్టర్‌కు రూ. 60,000 చెల్లిస్తున్నారు అని నిర్వాహకులు తెలిపారు. యూనివర్శిటీకి చెల్లించే మెస్ మరియు హాస్టల్ ఫీజుల పైన రూ. 10,000 చెల్లించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు.
Read More: Poisonous Food: చికెన్ లో చనిపోయిన ఎలుక.. యజమానిపై కేసు నమోదు?