Rachakonda CP: మహిళలను వేధిస్తే కఠిన చర్యలు- రాచకొండ సిపి సుధీర్ బాబు
- By Balu J Published Date - 09:13 AM, Wed - 7 February 24
Rachakonda CP: బాలికలను, మహిళలను వేధించే పోకిరిలను రాచకొండ షీ టీమ్స్ పోలీసులు వదిలిపెట్టే ప్రసక్తి లేదని, మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని రాచకొండ సీపీ జి.సుధీర్ బాబు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, కూరగాయల మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలలో మఫ్టీలో తిరుగుతూ షిటీం డెకాయ్ ఆపరేషన్లు చేస్తున్నారని, బాలికలను, మహిళలను వెంబడిస్తూ వేధించే పోకిరీల చేష్టలను సాక్ష్యాధారాలతో సహా పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తూ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారని అన్నారు.
రాచకొండ ఉమెన్ సేఫ్టీ వింగ్, షి టీమ్స్ ఆధ్వర్యంలో ఈవ్ టీజర్లకు మంగళవారం రాచకొండ క్యాంప్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిదిలో మహిళలను, యువతులను వేదింపులకు గురిచేస్తున్న 108 మందిని (మేజర్స్-67 , మైనర్స్ -41)* షీ టీమ్స్ అరెస్టు చేసినారు. వారికి ఎల్బి నగర్ CP Camp office (ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆఫీసు )లో కౌన్సిలర్స్ తో వారి కుటుంబ సబ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. గత నెల 16 నుండి 31 వరకు 133 పిర్యాదులు అందినాయని, రాచకొండ మహిళ రక్షణ విభాగం అధిపతి టి. ఉషా విశ్వనాథ్, డి.సి.పి, గారు తెలిపారు. ఫిర్యాదుల పై విచారణ చేపట్టి దర్యాప్తు పూర్తి చేశామన్నారు.