Dhoni:ధోనీ మళ్ళీ చెన్నై పగ్గాలు అందుకోవాలి: ఆర్ పి సింగ్
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకున్నాడు. అతడి స్థానంలో చెన్నై సుప్పర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడంలో పూర్తి స్థాయిలో విఫలమమవుతున్నాడు.
- By Hashtag U Published Date - 02:38 PM, Thu - 14 April 22

ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు సీఎస్‌కే కెప్టెన్సీ నుంచి ఎంస్ ధోని తప్పుకున్నాడు. అతడి స్థానంలో చెన్నై సుప్పర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన రవీంద్ర జడేజా జట్టును నడిపించడంలో పూర్తి స్థాయిలో విఫలమమవుతున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని పరోక్షంగా సలహాలు సూచనలు చేయడంతోనే చెన్నై జట్టు టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ఎంస్ ధోని మళ్లీ చేనై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాలని టీమిండియా మాజీ పేసర్ ఆర్పీ సింగ్ అన్నాడు. ఈసారి ఐపీఎల్ లో ఆర్సీబీతో మ్యాచ్ గెలిచినప్పటికీ సీఎస్‌కే బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతోంది. సాధారణంగా చెన్నై సూపర్ కింగ్స్ వారి తుది జట్టులో ఎక్కువగా మార్పులు చేయదు. చెన్నై పోటీలో నిలవాలంటే ఇకనుంచి వరుసగా వజయాలు సాధించాలి. ప్రస్తుతం సారథ్య బాధ్యతల వాళ్ళ రవీంద్ర జడేజా స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. కాబట్టి ఎంఎస్ ధోని తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకుంటే వారు వరుసగా విజయాలు సాధిస్తారని నేను అనుకుంటున్నాను అని ఆర్పీ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్ లో భాగంగా వరుసగా నాలుగు ఓటముల తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ ఎట్టకేలకు గెలుపు బోణీ కొట్టింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.తొలి నాలుగు మ్యాచ్‌లు ఓటమి పాలయ్యామన్న కసితో ఉన్న సీఎస్‌కే ఈ మ్యాచ్ లో తన విశ్వరూపం ప్రదర్శించింది. తొలుత బ్యాటింగ్ లోరాబిన్ ఊతప్ప, శివమ్ దూబేలు విజృంభించగా.. ఆ తరువాత బౌలింగ్ లో సీఎస్‌కే బౌలర్లు అదరగొట్టారు. మధ్యలో ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ చెలరేగినప్పటికి ధోనీ వ్యూహల ముందు తలవంచక తప్పలేదు.