UAE : యూఏఈలో హైదరాబాద్ మహిళ మృతి
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని అజ్మాన్‌లో భవనం ఐదవ అంతస్తు నుంచి కింద పడి హైదరాబాద్‌కి చెందిన యువతి...
- By Prasad Published Date - 01:42 PM, Sun - 23 October 22

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)లోని అజ్మాన్‌లో భవనం ఐదవ అంతస్తు నుంచి కింద పడి హైదరాబాద్‌కి చెందిన యువతి మరణించింది. దీనిపై విచారణ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని యువతి తల్లి కోరింది. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించడంలో సహాయం చేయాలని ఆమె కోరింది. తాలబ్‌కట్టాలోని అమన్‌నగర్‌లో నివాసం ఉంటున్న అఫ్షా బేగం గత రెండేళ్లుగా యూఏఈలో ఇంటి పనిమనిషిగా పనిచేస్తోంది. తన కుమార్తె అనుమానాస్పద మృతిపై ఆరా తీయాలని మంత్రి కేటీఆర్‌కి చేసిన విజ్ఞప్తిని ఎంబిటి నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ ట్విట్టర్‌లో తెలిపారు.
Afsha Begum from Hyderabad who was working as a housemaid in Ajman, UAE jumped from 5th floor of a building and died,her mother appealed @KTRTRS to inquire into the causes of death and bring back mortal remains.@MinisterKTR @KTRoffice @BTR_KTR pic.twitter.com/XSNqFhJDlm
— Amjed Ullah Khan MBT (@amjedmbt) October 22, 2022