HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hyderabadi Boy Becomes First Indian To Complete Intermediate In Two Streams

Agastya Jaiswal : ఇంట‌ర్ రెండు విభాగాల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన హైద‌రాబాద్ కుర్రాడు

  • Author : Prasad Date : 29-06-2022 - 8:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Agastya Jaiswal 1605927986
Agastya Jaiswal 1605927986

హైదరాబాద్: బైపీసీ, సీఈసీ రెండు విభాగాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన భారతదేశంలో మొదటి విద్యార్థిగా హైద‌రాబాద్ కుర్రాడు అగస్త్య జైస్వాల్ నిలిచాడు. మంగళవారం తెలంగాణ‌ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుద‌ల అయ్యాయి. ఈ ఫ‌లితాల్లో అగస్త్య జైస్వాల్ బైపిసిలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో శ్రీ చంద్ర కళాశాల నుండి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు క‌ళాశాల ప్ర‌క‌టించింది. అగ‌స్త్య జైస్వాల్ 11 సంవత్సరాల వయస్సులో ఒక ప్రైవేట్ కళాశాల నుండి CEC లో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తెలంగాణలోనే అతి పిన్న వయస్కుడుగా నిలిచాడు. 2020లోబ‌కేవలం 14 సంవత్సరాల వయస్సులోబ‌అగస్త్య జైస్వాల్ భారతదేశంలో BA మాస్-కమ్యూనికేషన్‌ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడయ్యాడు. అలాగే కేవలం 9 సంవత్సరాల వయస్సులో అగస్త్య తెలంగాణలో SSC ఉత్తీర్ణత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. త‌న తల్లిదండ్రుల మద్దతు, శిక్షణతో తాను సవాళ్లను అధిగమిస్తున్నానని అగ‌స్త్య జైస్వాల్ తెలిపాడు. అగస్త్య జైస్వాల్ కేవలం 1.72 సెకన్లలో A నుండి Z వర్ణమాలలను టైప్ చేయగ‌ల‌డ‌ని కుటుంబ‌స‌భ్యులు తెలిపారు. ఇదేకాక‌ అతను సవ్యసాచి అని.. రెండు చేతులతో వ్రాయగలడ‌ని తెలిపారు. అగస్త్య జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడిగా ఉన్నారు. అగస్త్య జైస్వాల్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి , యంగెస్ట్ రీసెర్చ్ స్కాలర్ నైనా జైస్వాల్ సోద‌రుడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Agastya jaiswal
  • hyderabad
  • Inter
  • naina jaiswal

Related News

Massive blast in Hyderabad's Saroornagar.

Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన మిస్టరీ పేలుడు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లతోపాటు ఎలక్ట్రిక్ వస్తువులు అన్నీ ఏమీ కాకుండా అలాగే ఉండగా.. భారీ పేలుడు జరగడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించగా.. చుట్టుపక్కల ఉన్న వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆ పేలుడుకు ఇంట్లోని గోడలు, కిటికీలు, తలుపులు తీవ్ర

    Latest News

    • Lakshmi Nivasam: లక్ష్మీ నివాసం ఇలా ఉంటుందా..?

    • Sting Energy Drink: స్కూళ్ల పరిధిలో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం

    • Almond Oil: ప్రకాశవంతమైన చర్మం, ఒత్తైన జుట్టు మీ సొంతం కావాలంటే ఆ నూనె ఉపయోగించాల్సిందే!

    • Ayatollah Ali Khamenei: ఖమేనీ అంత్యక్రియలు మోసల్లా మసీదుకు తరలింపు

    • Vijayasai Reddy: అమరావతి రాజధానిపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి హైకోర్టులో పిటిషన్

    Trending News

      • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd