Hyderabad Metro Rail : బాణాసంచాతో మైట్రోలో ప్రయాణం నిషేధం
దీపావళికి ముందు రైళ్లలో బాణాసంచా తీసుకురావడం మానుకోవాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయాణికులను...
- By Prasad Published Date - 09:44 PM, Fri - 21 October 22

దీపావళికి ముందు రైళ్లలో బాణాసంచా తీసుకురావడం మానుకోవాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రయాణికులను కోరింది.బాణాసంచాకి సంబంధించిన వస్తువులను తీసుకురావడాన్ని నిషేధించినట్లు పేర్కొంది. దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని మెట్రో రైల్ అధికారులు అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిని మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతించబోమని అధికారులు ప్రకటించారు.