Hyderabad: గ్రేటర్ లో మూడు చోట్ల ఉప ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు కీలక డివిజన్లు అయిన గుడిమల్కాపూర్, శాస్త్రిపురం, మరియు మెహిదీపట్నంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
- Author : Praveen Aluthuru
Date : 14-12-2023 - 2:27 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో మూడు కీలక డివిజన్లు అయిన గుడిమల్కాపూర్, శాస్త్రిపురం, మరియు మెహిదీపట్నంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. బిజెపి కార్పొరేటర్ దేవర కరుణాకర్ ,ఎంఐఎం కార్పొరేటర్లు మహ్మద్ ముబీన్ (శాస్త్రిపురం) మరియు మహ్మద్ మాజిద్ హుస్సేన్ (మెహిదీపట్నం) ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఆ స్థానాల్లో కార్పొరేటర్ ఖాళీలు ఏర్పడ్డాయి .ఈ సీట్లు ఇప్పుడు ఖాళీ కావడంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) మరియు ఎన్నికల విభాగం సంయుక్తంగా ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదాన్ని అభ్యర్థిస్తూ లేఖను రూపొందించడానికి కసరత్తు చేస్తున్నాయి. త్వరలో జరిగే ఈ ఉప ఎన్నికలు కీలకం కానున్నాయి. ఎన్నికల విభాగంతో పాటు జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రక్రియను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.