AP News: గుంటూరులో రేపు భారీ లోన్ మేళా, విద్యార్థులకు బంపర్ ఆఫర్
- By Balu J Published Date - 05:05 PM, Fri - 24 November 23

AP News: విదేశీ విద్యపై యువత ఆసక్తిని గమనించి పేద మధ్యతరగతి విద్యార్థులు కు ఇది మంచి అవకాశం. రాయపాటి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో రేపు భారీ లోన్ మేళా ఎత్తున నిర్వహించనుంది. పేద మధ్యతరగతి విద్యార్థిని, విద్యార్థుల కు ఎలాంటి ష్యురీటి లేకుండావిదేశీ విద్యకు కావలసిన లోన్స్ బ్యాంక్ లద్వారా రాష్ట్రంలోనే మా సంస్థ నుండి మొట్టమొదటగా ప్రారంభించడం గమనార్హం. గత11నెలల వ్యవధిలో ఇప్పట్టికే 96కోట్ల86లక్షల రూపాయల లోన్స్ 248మంది విద్యార్థులకు దగ్గరుండి ఇప్పించడం జరిగిందని,
రాబోయే10 రోజుల్లో మరో29మంది విద్యార్థులు కు86లక్షల లోన్స్ పూర్తి చేసి ఉంచామని, విదేశీ విద్యను అభ్యసించాలనే మధ్యతరగతి వారికి ఒక కలగా మిగలకుండా ఒక సదవకాశం కల్పించాలన్న ధ్యేయంతో రాయపాటి ఓవర్సీస్ పనిచేస్తుందని రాయపాటి ఓవర్సిస్ చైర్మన్ అమృతరావు రాయపాటి తెలిపారు. ఈ మెగా లోన్ మేళాలో 10జాతీయ స్థాయి బ్యాంకు లు సిద్ధంగా ఉన్నాయనితెలిపారు. రేపు జరిగే ఈ లోన్ మేళాను ప్రతి ఒక్క విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.