HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >How To Stay Safe From Sunburn

Heat Wave: వడదెబ్బ తగలకుండా సేఫ్‌గా ఉండడం ఎలా?

వడదెబ్బతో గత 3 రోజుల్లో 98 మంది దాకా మరణించినట్టు వార్తలొస్తున్నాయి.

  • Author : Balu J Date : 20-06-2023 - 2:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Election In Extreme Heat
Hot Summer 2

వడదెబ్బతో గత 3 రోజుల్లో 98 మంది దాకా మరణించినట్టు వార్తలొస్తున్నాయి. వడదెబ్బ కారణంగా ఉత్తరాది రాష్ట్రాల్లో సుమారు 400 మంది ఆసుపత్రుల్లో చేరారు. అంతేకాదు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రానున్న నాలుగైదు రోజుల్లో ఎండ, వడగాలులు ఉంటాయని ఆరెంజ్ ఎలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మరి ఇలాంటి టైంలో వడదెబ్బ తగలకుండా సేఫ్‌గా ఉండడం ఎలా?

వడదెబ్బ చాలా ప్రమాదకరమైనది. తక్కువ టైంలో ఇది ప్రాణాలు తీసేస్తుంది. అయితే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తపడొచ్చు. బయట వేడి తాకిడికి శరీరంలో ఉష్ణోగ్రతలను నియంత్రించే వ్యవస్థ బలహీనపడి, శరీర ఉష్ణోగ్రతలు అదుపు తప్పడమే వడదెబ్బ అంటే. వడదెబ్బ తగిలినప్పుడు శరీరం నుంచి చెమట రావడం ఆగిపోతుంది. పల్స్ వేగంగా కొట్టుకుంటుంది. శరీరం, మెదడు కంట్రోలో ఉండవు. కళ్లు తిరిగినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు చర్మం పొడిబారుతుంది కూడా. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన కేర్ తీసుకోకపోతే ప్రాణాలు పోయే ప్రమాదముంది.

సాధారణంగా ఐదేళ్ల లోపు పిల్లలకు, వయసుపైబడిన వాళ్లకు ఎండదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. అలాగే ఎండలో పనులు చేసేవాళ్లు, అథ్లెట్లు, క్రానిక్ డిసీజ్‌లతో బాధపడుతున్నవాళ్లకు కూడా ప్రమాదం ఎక్కువ. ఇలాంటి వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎవరికైనా వడదెబ్బ తగిలినట్టు అనిపిస్తే వెంటనే ఆ వ్యక్తిని చల్లని ప్రదేశంలోకి తీసుకెళ్లాలి. శరీరాన్ని చల్లటి నీటితో లేదా ఐస్ ముక్కతో తుడవాలి. నీళ్లు లేదా నిమ్మరసం తాగించాలి. లేట్ చేయకుండా డాక్టర్‍ దగ్గరకు తీసుకెళ్లాలి.

వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తలకు క్యాప్‍ పెట్టుకోవాలి. వెంట వాటర్ బాటిల్ తీసుకెళ్లాలి.

ఎండ ఎక్కువగా ఉండే టైంలో.. అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు ఎండలోతిరగకపోవటం బెటర్.

ఎండాకాలం నూనె పదార్థాలు తినడం తగ్గించాలి. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి, పళ్లరసాలు తాగుతుండాలి.

బయటకు వెళ్లేటప్పుడు చెమటను పీల్చుకునే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • doctors
  • health care
  • Heat Wave
  • Summer Season

Related News

Identify Autism This Way!

Autism: ఆటిజం వ్యాధిని ఇలా గుర్తించండి!

ఆటిజం లక్షణాలు ఏంటి, అసలు ఎందుకొస్తుంది? దీనిని ఎలా తగ్గించుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకోండి. ముందుగానే జాగ్రత్తపడడం వల్ల పిల్లలకి ఆటిజం వచ్చే అవకాశం తగ్గుతుంది. ఆటిజం అనేది న్యూరో డెవలప్‌మెంటల్ డిజార్డర్. ఇది పిల్లల ప్రవర్తన, సామాజిక పరస్పర చర్యలను ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యను ముందుగా ఎలా గుర్తించాలి? ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనేది పిల్లల అభివృద్ధిని ప్రభావి

  • Treating Breast Cancer with Bee Venom?

    Breast Cancer: తేనెటీగల విషంతో బ్రెస్ట్ క్యాన్సర్కు చికిత్స…?

Latest News

  • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

  • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

  • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

  • Roja Selvamani: మరోసారి జగన్‌ను విజయ్ ఫాలో అవుతున్నారు – రోజా

  • Rowdy Janardhana: విజయ్ బర్త్‌డే స్పెషల్.. రౌడీ జనార్ధన’ న్యూ పోస్టర్‌

Trending News

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

    • Breaking News: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మేజిక్ ఫిగర్ చేరిక

    • సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?

    • TVK: 107 మంది ఎమ్మెల్యేలు తో విజయ్ రాజీనామా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd