Narendra Modi : మాకూ మోడీ లాంటి లీడర్ కావాలి.. పాక్-అమెరికన్ వ్యాపార దిగ్గజం వ్యాఖ్యలు
పాకిస్తాన్‌కు కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపార దిగ్గజం సాజిద్ తరార్ అభిప్రాయపడ్డారు.
- Author : Pasha
Date : 15-05-2024 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
Narendra Modi : పాకిస్తాన్‌కు కూడా నరేంద్ర మోడీ లాంటి నాయకుడు కావాలని పాక్-అమెరికన్ వ్యాపార దిగ్గజం సాజిద్ తరార్ అభిప్రాయపడ్డారు. యావత్ పాకిస్తాన్ సమస్యలను పరిష్కరించాల్సిన నాయకత్వం తమ దేశానికి కావాలన్నారు. ‘‘పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని ఫలితంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో సామాజిక అశాంతి ఏర్పడింది. ఇంత జరుగుతున్నా అట్టడుగు సమస్యల పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. పాక్‌కు మోడీ లాంటి లీడర్ కావాలి’’ అని సాజిద్ తరార్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join
పాకిస్తాన్‌లో పుట్టిన సాజిద్ 1990వ దశకంలో అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం అమెరికాలోని బాల్టి మోర్ కేంద్రంగా వివిధ వ్యాపారాలు చేస్తున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈయన సన్నిహితుడు. పాకిస్తాన్ రాజకీయ, వ్యాపార ప్రముఖులతో కూడా సాజిద్ టచ్‌లోనే ఉంటారు. ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సాజిద్ సమాధానాలిస్తూ.. భారత ప్రధాని మోడీపై(Narendra Modi) ప్రశంసల జల్లు కురిపించారు.
Also Read : IDIOT Syndrome : నెటిజన్లలో కొందరికి ‘ఇడియట్’ సిండ్రోమ్.. ఏమిటిది ?
‘‘మోడీ భారత్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లిన బలమైన నాయకుడు. 2024లో భారత్ ఎదుగుదల అద్భుతంగా ఉంది. మూడోసారి కూడా మోడీ భారత ప్రధాని అవుతారని ఆశిస్తున్నాను. ప్రతికూల పరిస్థితుల నడుమ పాకిస్తాన్‌లోనూ పర్యటించిన చరిత్ర మోడీకిి ఉంది. ఆయన మళ్లీ ప్రధాని అయితే పాక్‌తో వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభిస్తారని అనుకుంటున్నాను. పాక్ శాంతియుతంగా ఉంటే భారత్‌కు కూడా మంచిదే’’ అని సాజిద్ పేర్కొన్నారు. ‘‘పాకిస్తాన్‌లోని ప్రభుత్వాలు ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించే దిశగా అడుగులు వేయలేకపోతున్నాయి. దీనివల్ల ప్రజలు దారుణ పరిస్థితుల నడుమ జీవితాలను గడపాల్సి వస్తోంది. మోడీ తరహా విజన్ కలిగిన నాయకుడు వస్తే పాకిస్తాన్ దశ కూడా మారిపోతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.