Honey Trap: జైపూర్ లో హనీ ట్రాప్.. వ్యక్తి ఆత్మహత్య
జైపూర్ లో హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. దీంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల మదన్‌లాల్ విషం తాగి ఆత్మహత్య
- Author : Praveen Aluthuru
Date : 16-08-2023 - 10:10 IST
Published By : Hashtagu Telugu Desk
Honey Trap: జైపూర్ లో హనీ ట్రాప్ కేసు వెలుగు చూసింది. దీంతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బిల్డింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న 41 ఏళ్ల మదన్‌లాల్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని జైపూర్‌లోని భంక్రోటా పోలీసులు తెలిపారు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు సూసైడ్ లేఖ రాశాడు. తనను మోసం చేసి ఇరికించారని లేఖలో ప్రస్తావించారు. ఓ అమ్మాయితో బలవంతంగా అశ్లీల వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించాడు. 10 లక్షలు ఇవ్వాలని సతీష్, యువతి డిమాండ్ చేశారని మదన్ లాల్ ఆవేదన చెందాడు. సమాజంలో తన పరువును కాపాడేందుకు ఒక్కసారిగా 4.50 లక్షలు ఇచ్చానని, అయినప్పటికీ వేధింపులకు గురి చేయడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు లేఖలో పేర్కొన్నాడు.
Also Read: Mutton Pulao: రెస్టారెంట్ స్టైల్ మటన్ పలావ్.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా?