Balakrishna PA Arrest:: బాలకృష్ణ పీఏ అరెస్ట్.. అసలు కారణం ఇదే..!
- By HashtagU Desk Published Date - 10:37 AM, Tue - 22 March 22

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పీఏ బాలాజీని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్ర–కర్ణాటక సరిహద్దులోని చిక్ బళ్లాపూర్ జిల్లా గౌరీబిదనూరు తాలూకా పరిధిలోని నగిరిగెర బీఎన్‌ఆర్ రెస్టారెంట్ వద్ద ఉన్న పేకాట క్లబ్‌పై కర్ణాటక స్పెషల్ పోలీసులు దాడి చేశారు. ఈ క్రమంలో హైటెక్ పద్ధతిలో పేకాట ఆడుతున్నబాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు 19 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 1,56,750 నగదు, 8 కార్లు, 3 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఇక పోలీసులకు పట్టుబడిన వారిలో ఉపాధ్యాయులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఉండడం గమనార్హం. ఈక్రమంలో బాలకృష్ణ పీఏ బాలాజీతో పాటు మిగతావారిని న్యాయస్థానంలో హాజరు హాజరుపర్చగా, వారకి కోర్టు రిమాండ్ విధించింది. ఇకపోతే బాలాజీ కర్ణాటక పోలీసులకు చిక్కడంతో హిందూపురంలో హాట్ టాపిక్ అయింది. బాలకృష్ణ పీఏలు వరసగా ఏదోఒక వివాదంలో చిక్కుకుంటుండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో బాలకృష్ణ పీఏగా పనిచేసిన శేఖర్ కూడా పంచాయతీ రాజ్ శాఖలో భారీ అవినీతికి పాల్పడి జైలుకెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బాలకృష్ణ మరో పీఏ బాలాజీ సైతం పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడడంతో, బాలకృష్ణ పీఏల బ్లడ్ అండ్ బ్రీడ్ వేరంటూ హిందూపురం ప్రజలు చర్చించుకుంటున్నారు.