Heavy Rain In Hyderabad : హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం
నిన్నటి వరుకు భానుడి భగభగలతో ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో తెల్లవారుజామున
- By Prasad Published Date - 09:42 AM, Fri - 14 April 23

నిన్నటి వరుకు భానుడి భగభగలతో ఉన్న హైదరాబాద్ నగరం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలో తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురుస్తుంది. అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, పంజాగుట్ట, మణికొండ, షేక్‌పేట, మాదాపూర్, టోలిచౌకిలతో పాటు పలువ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో పలుప్రాంతాల్లో చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమైయ్యారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. పడిపోయిన విద్యుత్ స్తంభాలను విద్యుత్‌శాఖ అధికారులు తొలిగిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.