Heavy Rain : ఏపీలో మరోసారి భారీ వర్షాలు..పలు జిల్లాలో రెడ్ అలెర్ట్
Cyclone Alert : ఈరోజు నుండి వైజాగ్ , , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని
- By Sudheer Published Date - 10:25 AM, Mon - 14 October 24

ఏపీని(AP) వర్షాలు (Heavy Rain) వదలడం లేదు. గత నెలలో విస్తారంగా కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా విజయవాడ నగరంలోని ప్రధాన కాలనీ లన్నీ మునిగాయి. భారీ ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లింది. ఈ నష్టాల నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు మరచిపోతుండగా..ఇప్పుడు మరోసారి భారీ వర్షాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో నాలుగు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈరోజు నుండి వైజాగ్ , , అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ,మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, తూ.గో జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందం చేరుకుంది. తిరుపతిలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అధికారులు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Read Also : China Vs Taiwan : తైవాన్ చుట్టూ చైనా ఆర్మీ.. భారీ సైనిక డ్రిల్స్