Heavy Floods : నాగార్జునసాగర్‌కు భారీగా వరద నీరు.. 22 గేట్లు ఎత్తివేత
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ప్రా...
- Author : Prasad
Date : 15-10-2022 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఇటు ఎగువన కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ నుంచి 4.17 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి 3.69 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక మొత్తంగా 4.17 లక్షల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీటిమట్టం ఉంది.