GVMC Corporators : ప్రమాదంలో చిక్కుకున్న విశాఖ కార్పోరేటర్లు.. టూర్‌కి వెళ్లి..?
వైజాగ్ కార్పోరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ
- By Prasad Published Date - 01:04 PM, Sat - 20 August 22

వైజాగ్ కార్పోరేటర్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో వారంతా ఆగిపోయారు. ఈ నెల 16న విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు స్టడీ టూర్ వెళ్లారు. అయితే మార్గమధ్యలో కొండచరియలు విరిగిపడటంతో వారంతా నిన్న రాత్రి నుంచి రోడ్ పై బస్ ల లోనే కాలం గడుపుతున్నారు. ఘటనాస్థలానికి ఆర్మీ సిబ్బంది చేరుకున్నారు. అయితే అక్కడ వర్షం పడుతుండడంతో తో రోడ్ క్లియర్ చేసేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదె. చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరం లో ఈ ఘటన జరిగింది. మింద్ ప్రాంతంలో కార్పోరేటర్లు చిక్కుకున్నారు. నిన్న కులు మునిసిపాలిటీ లోని పలు ప్రాంతాలను కార్పోరేట్లు సందర్శించారు. ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలి ని విశాఖ కార్పోరేటర్లు సందర్శించారు