Guntur Crime: పోలీసుల అదుపులో కిలాడీలు
ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు సిటికి వచ్చి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళలను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- By Hashtag U Published Date - 10:56 PM, Wed - 18 May 22

ఇతర రాష్ట్రాల నుంచి గుంటూరు సిటికి వచ్చి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళలను గుంటూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అదేశాలమేరకు గుంటూరు సిటీ తో కలిపి జిల్లాలో పలు ప్రాంతాలలో ఈమధ్య కాలంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు మహిళలు, వాహనాలను ఆపి బిచ్చం అడగడం, ఇవ్వని వారి వద్దనుంచి బలవంతపు వసూలకు పాల్పడడం, రాత్రుళ్ళు కార్లు, ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారిని అడ్డగించడం, వ్యభిచార వృత్తి, వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహిళలను గుంటూరు జిల్లా, గుంటూరు సిటీ వెస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని, నార్త్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు బుధవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు.