Jagadish Reddy: కాంగ్రెస్, బీజేపీలపై జగదీశ్ రెడ్డి ఫైర్.. కారణమిదే
- Author : Balu J
Date : 16-06-2024 - 5:27 IST
Published By : Hashtagu Telugu Desk
Jagadish Reddy: బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్,బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈఆర్సీ ముందు కాంగ్రెస్,బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారని, ఏ విచారణకు అయినా సిద్దమని మేము ఛాలెంజ్ చేశాం అని గుర్తు చేశారు. కమీషన్ పాత్రపైన కేసీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారని, విచారణ చేసే అర్హత కమీషన్ చైర్మన్ కోల్పోయారని కేసీఆర్ లేఖ రాశారు అని మాజీ మంత్రి అన్నారు.
ఇచ్చిన గడువు ప్రకారం మేము సమాధానం ఇద్దామని అనుకున్నామని, కాంగ్రెస్,బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారని అన్నారు. విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెప్తారు అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమీషన్లు రద్దు అయ్యాయని, ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమీషన్ ఎట్లా వేస్తారని
నరసింహారెడ్డికి తెలియదా అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమన్ సింగ్ కు ఏమైనా లంచం ఇచ్చారా బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని, కమీషన్ ఏర్పాటు కుట్రపూరితంగా జరిగింఅని, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని జగదీశ్ రెడ్డి అన్నారు.