Gujarat Titans: అరంగేట్రం లో అదరగొడుతుందా ?
క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-15 సీజన్ వచ్చేసింది. స్వదేశంలో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్ కోసం టోర్నీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ పక్కా వ్యూహంతో జట్టుని కొనుగోలు చేసింది.
- By Naresh Kumar Published Date - 12:25 PM, Sat - 26 March 22

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-15 సీజన్ వచ్చేసింది. స్వదేశంలో మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2022 సీజన్ కోసం టోర్నీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ పక్కా వ్యూహంతో జట్టుని కొనుగోలు చేసింది. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా, ఆశిష్ నెహ్రా హెడ్ కోచ్‌గా, గ్యారీ కిర్‌స్టన్ మెంటార్‌గా వ్యవహరించనున్నారు. మెగా వేలానికి ముందు హార్ధిక్ పాండ్యతో పాటు రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను డ్రాఫ్ట్ చేసుకున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ మెగా వేలంలో డేవిడ్ మిల్లర్ , మాథ్యూ వేడ్ , లాకి ఫెర్గూసన్ , జేసన్ రాయ్,రాహుల్ తెవాతియా లాంటి స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ బలాబలాలను ఇప్పుడు చూద్దాం.
ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాతి టైటాన్స్ బలాల విషయానికొస్తే.. సారథి హార్దిక్ పాండ్య, యువ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్, సీనియర్ స్పిన్నర్ రషీద్‌ఖాన్, పవర్ హిట్టర్ డేవిడ్ మిల్లర్ ఆ జట్టుకి అతిపెద్ద బలం అని చెప్పొచ్చు. తమదైన రోజున ఒంటి చేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేయగల సత్తా వీరికి ఉంది. ఇక ఆల్ రౌండర్ల విభాగంలో విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా రాణించగల సమర్థులు. మిల్లర్, రహ్మతుల్లా గుర్బాజ్ లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నారు. ఇక బౌలింగ్ విభాగంలో సీనియర్ పేసర్లు మహ్మద్ షమి, అల్జారీ జోసెఫ్ చెలరేగడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు బలహీనతల విషయానికొస్తే.. కెప్టెన్ హార్దిక పాండ్య గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడంలేదు.
అలాగే బారి అసలు పెట్టుకున్న సీనియర్ ఓపెనర్ జేసన్ రాయ్ ఈ మెగా టోర్నీకి ముందే .తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అలాగే శుభ్‌మన్ గిల్ కు జోడిగా సరైన ఓపెనర్ లేదు.. ఇదే కాకుండా డేవిడ్ మిల్లర్ , విజయ్ శంకర్, రాహుల్ తెవాతియా గత సీజన్లో అంతగా రాణించలేదు.. మరి ఈ అవరోధాలను అధిగమించి గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022 సీజన్ టైటిల్ గెలుస్తుందేమో అన్నది చూడాలి.