GT Wins: మెరిసిన శుభ్ మన్, హ్యాట్రిక్ కొట్టిన హార్ధిక్.. గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ!!
- By Hashtag U Published Date - 01:13 AM, Sat - 9 April 22

ఐపీఎల్ 2022 సీజన్ లో కొత్త కెప్టెన్లు మెరిసారు. మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన మ్యాచ్ ఫ్యాన్స్ కు కావాల్సినంత ఎంటర్ టైన్ అందించింది. లాస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ వరకూ నరాలు తెగె ఉత్కంఠతో సాగింది ఈ మ్యాచ్. గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ అందుకోగా…గుజరాత్ టైటాన్స్ విజయాన్ని వరుసగా మూడోసారి తన ఖాతాలో వేసుకుంది. గత మ్యాచ్ లో 46 బంతుల్లో 6ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసిన IPLలో బెస్ట్ స్కోర్ నమోదు చేసుకున్నాడు శుభ్ మన్ గిల్. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో దాన్ని అధిగమించాడు. 96 పరుగులు చేసిన గిల్…4 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేశాడు.
190 పరుగుల టార్గెగ్ తో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ మాథ్యూ వేడ్ వికెట్ త్వరగా కోల్పోయింది. 7 బంతుల్లో ఒక ఫోర్ తో పాటు 6 పరుగులు చేసిన వేడ్, రబాడా బౌలింగ్ లో జానీ బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చాడు. తర్వాత తొలి మ్యాచ్ ఆడుతున్న సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ కలిసి రెండో వికెట్ కు 101 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. 30 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ తో 35 పరుగులు చేసిన సాయి సుదర్శన్ రాహుల్ చాహార్ బౌలింగ్ లో మయాంక్ అగర్వాల్ కు క్యాచ్ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యా శుభ్ మన్ గిల్ కలిసి మూడో వికెట్ కు స్కోర్ బోర్డును ఉరుకులు పరుగులు పెట్టించారు. అయితే 80 ప్లస్ స్కోరు దాటిన తర్వాత శుభ్ మన్ గిల్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు.
43 బంతుల్లో 78 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్….తర్వాత 16 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ నెట్ రన్ రేట్ పెరుగుతూ వచ్చింది. 59 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్, 96 పరుగులు చేసిన శుభ్ మన్ గిల్, రబాడా బౌలింగ్ లో వెనుదిరిగాడు.
ఇక గుజరాత్ విజయానికి లాస్ట్ ఓవర్ లో 18 పరుగులు అవసరం ఉండటంతో డేవిడ్ మిల్లర్ తోపాటు కెప్టెన్ హార్దిన్ పాండ్యా క్రిజులో ఉన్నాడు. ఒడియన్ స్మిత్ మొదటి బంతికే హార్దిక్ రనౌట్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన రాహుల్ తర్వాత బంతికి రన్ తీశాడు. తర్వాత డేవిడ్ మిల్లర్ ఫోర్ కొట్టాడు. స్మిత్ తప్పిదం వల్ల డేవిడ్ మిల్లర్ మంచి బాల్ వేసినా ఓవర్ త్రో చేయడంతో రెండు పరుగులు వచ్చాయి. దీంతో 2 బంతుల్లో 12 పరుగులు అవసరం అయ్యాయి. గతంలో ఎన్నోసార్లు మెరపు బ్యాటింగ్ తో రెచ్చిపోయిన తెవాతియా చివరి రెండు బంతులను నేరుగా స్టేడియంలోకి పంపి తన జట్టుకు మరో భారీ విజయాన్ని అందించాడు. సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న శుభమన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
That last over: 😨😱🤯😰😂🤩#SeasonOfFirsts #AavaDe #PBKSvGT pic.twitter.com/j39VOfmR6G
— Gujarat Titans (@gujarat_titans) April 8, 2022