Apollo Medical College Convocation Utsav: అట్టహాసంగా అపోలో మెడికల్ కాలేజీ కాన్వకేషన్ ఉత్సవం
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఆపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
- Author : Kode Mohan Sai
Date : 03-12-2024 - 12:39 IST
Published By : Hashtagu Telugu Desk
Apollo Medical College Convocation Utsav: ఆపోలో మెడికల్ కాలేజ్ కాన్వోకేషన్ ఉత్సవం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రఖ్యాత వైద్యులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఆపోలో మెడికల్ కాలేజ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి అత్యుత్తమంగా నిలిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందించారు. 2018 బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థులైన 100 మందికి పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీవోవో అపర్ణా రెడ్డి, డీన్ మనోహర్, మెడికల్ కాలేజ్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
జనరల్ మెడిసిన్‌లో అవినాష్‌కు గోల్డ్ మెడల్:
2018 బ్యాచ్‌లో జనరల్ మెడిసిన్ విభాగంలో డాక్టర్ దండు అవినాష్ రెడ్డి గోల్డ్ మెడల్ సాధించారు. “కష్టపడి చదువుకున్నందునే ఈ గోల్డ్ మెడల్ సాధించగలిగాను. అత్యుత్తమ విద్య అందించిన ఆపోలోకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను” అని అవినాష్ తెలిపారు. అదేవిధంగా, డాక్టర్ ప్రతాప్‌రెడ్డికి సంబంధించి ఛైర్మన్ మెడల్‌ను సిద్ధాంత్ బర్మేచ అందుకున్నారు.
700 దాటిన ఆపోలో మెడిసిన్ గ్రాడ్యుయేట్లు:
ఆపోలో మెడికల్ కాలేజ్ ప్రారంభమైనప్పటి నుండి పుష్కరకాలం దాటింది. 2012లో ప్రారంభమైన ఈ కాలేజ్ నుంచి ఇప్పటివరకు 700 మందికి పైగా విద్యార్థులు డాక్టర్లుగా ఎదిగారు. ఈ విషయాన్ని కాన్వోకేషన్లో ప్రస్తావించారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. “భారతదేశంలోనే నాణ్యమైన వైద్య విద్యను అందిస్తున్న ఆపోలోలో చదవడం మీ అదృష్టం. ఈ పునాదిని మరింత బలంగా మార్చుకుని వైద్యులుగా రాణించండి. మీ విద్యావంతమైన జీవితానికి ఇది కేవలం ప్రారంభం మాత్రమే. అలాగే, జీవితాంతం నేర్చుకునే ఈ దృఢ సంకల్పం మీరు కొనసాగించాలని ఆశిస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.