Government Scheme: రెండో బిడ్డ పుడితే ప్రభుత్వం ఎంత డబ్బు ఇస్తుందో తెలుసా?
దేశంలో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తును పరిరక్షించడం కోసం, మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు కౌసల్య ప్రసూతి
- Author : Anshu
Date : 05-11-2022 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
దేశంలో ఉన్న ఆడపిల్లల భవిష్యత్తును పరిరక్షించడం కోసం, మెరుగుపరచడం కోసం ప్రభుత్వాలు కౌసల్య ప్రసూతి లాంటి పథకాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆడవారిపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాల రేటును తగ్గించడం కోసం చత్తీస్ ఘడ్ ప్రభుత్వం కౌసల్య ప్రసూతి అనే పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనగా మార్చి 8వ తేదీన ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ప్రారంభించిన విషయం తెలిసిందే.
కాగా ఈ పథకం కుటుంబంలో రెండవ సంతానం కూతురు ఉన్నప్పుడు మాత్రమే అందుతుంది. మొదటి సంతానంగా పాప పుట్టినప్పటికీ ఈ పథకాన్ని ప్రయోజనాన్ని పొందలేరు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో రెండో సారి ఆడపిల్ల పుడితే వారికి రూ.5 వేలును ప్రభుత్వం అందజేస్తుంది. అలాగే ఛత్తీస్‌గఢ్ కౌశల్య మాతృత్వ యోజన ప్రయోజనాన్ని పొందడానికి అభ్యర్థి చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన వారై ఉండటం తప్పనిసరి. రెండవ కుమార్తె పుట్టిన సందర్భంలో మాత్రమే ఈ పథకం ప్రయోజనాన్ని పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
మరి దరఖాస్తుకు ఏ ఏ సర్టిఫికెట్లను అందించాలి అన్న విషయాలకు వస్తే..ఆధార్ కార్డు,ప్రాథమిక చిరునామా రుజువు, ఆదాయ ధృవీకరణ పత్రం,రేషన్ కార్డు, వయస్సు సర్టిఫికేట్,ఆడపిల్లల జనన ధృవీకరణ పత్రం,ఓటరు ఐడి,మొబైల్ నంబర్,ఇ మెయిల్ ఐడి. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభమవుతాయి అన్న విషయానికి వస్తే.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో ముఖ్యమంత్రి అర్హులైన ఐదు కుటుంబాలకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు అందించడం జరిగింది. కానీ దరఖాస్తు కోసం ఆన్‌లైన్ వెబ్‌సైట్ ఇంకా ప్రకటించబడలేదు. కాగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వీటి కోసం దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది.