Ayyan App : అయ్యప్ప భక్తుల కోసం ‘అయ్యన్ యాప్’
Ayyan App : అయ్యప్ప స్వామి దర్శనం కోసం అడవిలో నుంచి నడుస్తూ శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.
- By Pasha Published Date - 12:31 PM, Sun - 26 November 23

Ayyan App : అయ్యప్ప స్వామి దర్శనం కోసం అడవిలో నుంచి నడుస్తూ శబరిమలకు వెళ్లే భక్తులకు శుభవార్త. వారికి అత్యవసర సేవలను అందించేందుకు కేరళ అటవీశాఖ ‘అయ్యన్ యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా అయ్యప్ప స్వాములు పలు సేవలను పొందొచ్చు. గూగుల్ ప్లేస్టోర్‌లో అయ్యన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది తెలుగు, హిందీ, తమిళం, మళయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
శబరిమల ఆలయానికి వెళ్లే మార్గంలోని సేవా కేంద్రాల వివరాలు అయ్యన్ యాప్‌లో ఉన్నాయి. హెల్త్ ఎమర్జెన్సీ వస్తే ఎక్కడ కాంటాక్ట్ చేయాలనేది ఇందులో పొందుపరిచారు. వసతి సౌకర్యాల వివరాలు కూడా ఉన్నాయి. అడవిలో ఏనుగులు సంచరించే ప్రాంతాలు, తాగునీటి పాయింట్ల వివరాలు, ఫైర్ ఫోర్స్ సమాచారం, పోలీస్ ఎయిడ్ పోస్ట్‌ల సమాచారమంతా ఈ యాప్‌లో లభిస్తుంది. ఇటీవల కాలంలో తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలినడకన వెళ్తున్న భక్తులపై చిరుతలు దాడి చేసిన ఘటనలు కలకలం క్రియేట్ చేశాయి. ఈనేపథ్యంలో శబరిమలకు వెళ్లే మార్గంలోని అడవుల్లోనూ భక్తుల భద్రత రీత్యా ఈ యాప్‌ను కేరళ అటవీశాఖ అభివృద్ధి చేసిందని తెలుస్తోంది.
Also Read: Jaggery Benefits: ఈ చలికాలంలో బెల్లం కాంబినేషన్‌తో వీటిని తింటే ఆరోగ్యం సూపర్..!
భక్తులు అడవుల మీదుగా శబరిమలకు వెళ్తుండగా మార్గం మధ్యలో ఏనుగుల లాంటి వన్యమృగాలు ఎదురైతే.. ఈ యాప్ ద్వారా అటవీ అధికారుల సాయం పొందొచ్చని కేరళ అటవీశాఖ అధికారులు(Ayyan App) వెల్లడించారు. భక్తుల ఆపద ఎదురైన స్థలాన్ని వెంటనే గుర్తించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టేలా ఈ యాప్‌ను డిజైన్ చేశారు. అయ్యన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే లింక్ ఇదే.