Sabarimala: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్!
శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులకు ఊరట లభించింది. అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్‌లోనే తమవెంట తీసుకువెళ్లొచ్చు.
- By Balu J Published Date - 09:07 PM, Tue - 22 November 22

శబరిమలకు విమానాల్లో వెళ్లే అయ్యప్ప భక్తులకు ఊరట లభించింది. అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని విమాన క్యాబిన్‌లోనే తమవెంట తీసుకువెళ్లొచ్చు. ఇందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అనుమతించింది. ఎయిర్‌పోర్టులో అన్ని తనిఖీలు ముగిసిన తర్వాత.. ఇరుముడిని క్యాబిన్‌లోకి తీసుకెళ్లేందుకు అయ్యప్ప భక్తులకు అనుమతించాలని అన్ని విమానాశ్రయ భద్రతా సిబ్బందికి సర్క్యులర్ జారీ చేసింది. అయితే, మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకు మాత్రమే (జనవరి 20వ తేదీ) ఈ వెసులుబాటు ఉంటుందని బీసీఏఎస్ స్పష్టం చేసింది.