Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద ఉద్రిక్తత.. ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవంలో ఖలిస్థాన్ నినాదాలు
Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం వద్ద ఈరోజు సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాల్లో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు గుప్పించాయి.
- By Kavya Krishna Published Date - 10:44 AM, Fri - 6 June 25

Golden Temple: అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం వద్ద ఈరోజు సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. 1984లో జరిగిన ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ 41వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమాల్లో ఖలిస్థాన్ అనుకూల నినాదాలు గుప్పించాయి. శిరోమణి అకాలీదళ్ (మాన్ వర్గం) అధినేత సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ దేవాలయ ప్రాంగణానికి వచ్చిన క్షణంలోనే ఆయన అనుచరులు “ఖలిస్థాన్ జిందాబాద్” అంటూ గట్టిగా నినాదాలు చేసిన దృశ్యాలు సంచలనం సృష్టించాయి.
ఇప్పటికే ఉదయం నుంచి స్వర్ణ దేవాలయంలో 41వ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇదే రోజున ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ దర్యాప్తులో హతమైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే వర్ధంతి కావడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. మాన్ చేరుకున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు స్వతంత్ర ఖలిస్థాన్ కోసం నినదించడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
Kidney Stones : అసలు కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయి..? వాటి లక్షణాలు, నివారణ చిట్కాలు ఏంటి…?
దీని ముందు రోజు, దల్ ఖల్సా ఆధ్వర్యంలో అమృత్‌సర్‌లో భారీ ర్యాలీ జరిగింది. బుర్జ్ అకాలీ ఫూలా సింగ్ ప్రాంతం నుంచి స్వర్ణ దేవాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో యువకులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఖలిస్థాన్ అనుకూల గళాలు సెంటిమెంటును మళ్లీ ఉరకలు వేయించాయి. రాజకీయ నేతలైన సిమ్రన్‌జిత్ సింగ్ మాన్ తో పాటు పంథ్ సేవక్ జథా నాయకుడు దల్జీత్ సింగ్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ‘ఆపరేషన్ బ్లూ స్టార్’కు నిరసనగా శుక్రవారం అమృత్‌సర్ బంద్ నిర్వహించాలంటూ దల్ ఖల్సా పిలుపునిచ్చింది.
1984 జూన్‌లో భారత సైన్యం స్వర్ణ దేవాలయ ప్రాంగణంలోని సాయుధ ఉగ్రవాదులను తగ్గించే క్రమంలో ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ చేపట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఘటన సిక్కు సమాజానికి ఆవేదన, భావోద్వేగాల చిహ్నంగా నిలిచింది. ప్రతి సంవత్సరం వార్షికోత్సవాలను పురస్కరించుకొని స్వర్ణ దేవాలయంపై భద్రతా చర్యలు భారీగా ఉంటాయి. గత ఏడాది 40వ వార్షికోత్సవానికీ ఇలాంటి నినాదాలు మిన్నంటాయి.
ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అధికారులు స్వర్ణ దేవాలయం పరిసర ప్రాంతాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రత్యేక బలగాలను మోహరించారు. ఏ చిన్న అవాంఛనీయ ఘటనకూ తావివ్వకూడదన్న ఉద్దేశంతో సెక్యూరిటీ అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
Stress : పిల్లల నుండి పెద్దల వరకు అందరికి ఇదే సమస్య..నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి