Gold- Silver Price: నేటి బంగారం, వెండి ధరలు ఇవే.. మీ ఏరియాలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
- By Gopichand Published Date - 07:16 AM, Wed - 20 December 23
Gold- Silver Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Price) నేడు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,400గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,620గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ. 79,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక బుధవారం (డిసెంబర్ 20, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: IPL 2024 Full Squad: ఐపీఎల్ వేలం తర్వాత 10 జట్లలోని ఆటగాళ్ల పూర్తి లిస్ట్ ఇదే..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,770గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,950 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,220గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.62,620 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.57,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,620గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,620గా ఉంది.
We’re now on WhatsApp. Click to Join.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,500 ఉండగా, ముంబైలో రూ.77,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.79,500 ఉండగా, కోల్కతాలో రూ.77,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.75,550 ఉండగా, కేరళలో రూ.79,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.79,500 ఉండగా, విజయవాడలో రూ.79,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Tags
Related News
Zomato: జొమాటో మరో కీలక నిర్ణయం.. ఫాస్ట్ డెలివరీలు కావాలంటే ఎక్స్ట్రా ఫీజు కట్టాల్సిందే..!
జొమాటో కొత్త ఫీచర్ని ప్రయత్నిస్తోంది. దీని ద్వారా మీరు మీ ఆహారాన్ని వేగంగా డెలివరీ చేయడానికి జొమాటోకు అదనంగా చెల్లింపు చేయాల్సి ఉంటుంది.