Gold Price: గోల్డ్ కొనాలనుకునేవారికి బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి.
- By Gopichand Published Date - 07:29 AM, Tue - 5 December 23
Gold Price: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు భారీగా పెరిగాయి. మంగళవారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,200గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.83,500కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక మంగళవారం (డిసెంబర్ 05, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: UGC NET: యూజీసీ NET అడ్మిట్ కార్డ్ విడుదల.. డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా..!
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59,000 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.64,350గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.59,750 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,180గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,850 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.64,200 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.58,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,200గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.58,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,200గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 80,500 ఉండగా, ముంబైలో రూ.80,500గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.83,500 ఉండగా, కోల్కతాలో రూ.80,500గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.79,000 ఉండగా, కేరళలో రూ.83,500గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.83,500 ఉండగా, విజయవాడలో రూ.83,500 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
Related News
RBI New Rule: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ బ్యాంక్ అకౌంట్లో మైనస్ బ్యాలెన్స్ ఉన్నాయా..?
బ్యాంకులకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఒకప్పుడు ఉండేది.