HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Gautam Adani Gives Rs 100 Crore To Telangana Cm Revanth Reddy

Gautam Adani 100 Crores: తెలంగాణ కోసం రూ. 100 కోట్ల విరాళం ప్ర‌క‌టించిన అదానీ

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి మంచి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌తంలో కీల‌క ప్ర‌క‌ట‌న పిలుపునిచ్చారు.

  • Author : Gopichand Date : 18-10-2024 - 5:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gautam Adani 100 Crores
Gautam Adani 100 Crores

Gautam Adani 100 Crores: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భారీ విరాళం ఇచ్చారు. రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు రూ. 100 కోట్ల‌ (Gautam Adani 100 Crores)కు చెందిన చెక్కును సీఎం రేవంత్‌కు శుక్ర‌వారం అందించారు. స్కిల్ వర్సిటీని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనపై అదానీ ప్రశంసలు కురిపించారు. అదానీ చెక్కు అందించిన విష‌యాన్ని సీఎం త‌న ఎక్స్ ఖాతా ద్వారా తెలియ‌జేశారు. అంతేకాకుండా వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ గౌతమ్ అదాని గారు మర్యాదపూర్వకంగా కలిశారు.

అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు. pic.twitter.com/mxMonqa8w8

— Revanth Reddy (@revanth_anumula) October 18, 2024

ఇక‌పోతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి మంచి ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న గ‌తంలో కీల‌క ప్ర‌క‌ట‌న పిలుపునిచ్చారు. తెలంగాణ‌లోని ప్ర‌ముఖ పారిశ్రామిత‌వేత్త‌లు, బ‌డా సంస్థ‌లు స్కిల్ యూనివ‌ర్శిటీలో త‌మ వంతు భాగ‌స్వామ్యం కావాల‌ని పేర్కొన్నారు. యువ‌త‌కు నైపుణ్యాలు నేర్పించటానికి స‌హ‌కారం అందించాల‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం సుమారు 150 ఎక‌రాల స్థ‌లంతో పాటు రూ. 100 కోట్లు కేటాయించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

Also Read: TGPSC Group-1 Mains 2024: గ్రూప్-1 మెయిన్స్‌కు హైకోర్టులో లైన్ క్లియర్.. 31,383 మంది అభ్యర్థులు హాజ‌రు..!

స్కిల్ యూనివర్సిటీలో నవంబర్‌ నెల నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ ఇటీవ‌ల ఓ ప్ర‌క‌ట‌న కూడా జారీ చేసింది. ప్రస్తుతానికి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంస్థ‌లో క్లాసులు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీ.ఎల్.వీ.ఎస్.ఎస్ సుబ్బారావు ఆ ప్ర‌క‌న‌ట‌లో వెల్ల‌డించారు. లాజిస్టిక్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో యువతకు నైపుణ్యాలు పెంపొందించే విధంగా న‌వంబ‌ర్ 4 నుంచి కోర్సుల్లో శిక్ష‌ణ ప్రారంభం కానున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆసక్తి గ‌ల‌వారు ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 crores
  • CM Revanth Reddy
  • donation
  • gautam adani
  • Skill University
  • Skill University Telangana
  • telangana
  • telangana CM

Related News

Rajya Sabha Elections

Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలోని రెండు స్థానాలు సహా 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 26వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 16న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. తెలంగాణ నుంచి సురేశ్ రెడ్డి, అభిషేక్ సింఘ్వీలతో పాటు 37 మంది పదవీ కాలం ఏప్రిల్ నెలతో ముగియనుంది. మహారాష్ట్రలో 7, ఒడిశా 4, తమిళనాడు 6, పశ్చిమ

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Half Day Schools

    Half-Day Schools: తెలంగాణ లో ఒంటిపూట బడులు ఎప్పటి నుండి అంటే ..!!

  • Liquor Bottles

    మందుబాబులకు గుడ్ న్యూస్..

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd