Gautam Adani 100 Crores: తెలంగాణ కోసం రూ. 100 కోట్ల విరాళం ప్రకటించిన అదానీ
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన గతంలో కీలక ప్రకటన పిలుపునిచ్చారు.
- Author : Gopichand
Date : 18-10-2024 - 5:38 IST
Published By : Hashtagu Telugu Desk
Gautam Adani 100 Crores: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ భారీ విరాళం ఇచ్చారు. రూ.100 కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు రూ. 100 కోట్ల (Gautam Adani 100 Crores)కు చెందిన చెక్కును సీఎం రేవంత్‌కు శుక్రవారం అందించారు. స్కిల్ వర్సిటీని రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ఆలోచనపై అదానీ ప్రశంసలు కురిపించారు. అదానీ చెక్కు అందించిన విషయాన్ని సీఎం తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా వారికి కృతజ్ఞతలు తెలిపారు.
అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ శ్రీ గౌతమ్ అదాని గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
అదానీ ఫౌండేషన్ నుండి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100కోట్ల విరాళం చెక్కు రూపంలో అందజేశారు. pic.twitter.com/mxMonqa8w8
— Revanth Reddy (@revanth_anumula) October 18, 2024
ఇకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి మంచి పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన గతంలో కీలక ప్రకటన పిలుపునిచ్చారు. తెలంగాణలోని ప్రముఖ పారిశ్రామితవేత్తలు, బడా సంస్థలు స్కిల్ యూనివర్శిటీలో తమ వంతు భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాలు నేర్పించటానికి సహకారం అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు 150 ఎకరాల స్థలంతో పాటు రూ. 100 కోట్లు కేటాయించిన విషయం మనకు తెలిసిందే.
స్కిల్ యూనివర్సిటీలో నవంబర్ నెల నుంచి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు స్కిల్ యూనివర్సిటీ ఇటీవల ఓ ప్రకటన కూడా జారీ చేసింది. ప్రస్తుతానికి గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంస్థలో క్లాసులు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీ.ఎల్.వీ.ఎస్.ఎస్ సుబ్బారావు ఆ ప్రకనటలో వెల్లడించారు. లాజిస్టిక్, మెడికల్, హెల్త్, ఫార్మా రంగాల్లో యువతకు నైపుణ్యాలు పెంపొందించే విధంగా నవంబర్ 4 నుంచి కోర్సుల్లో శిక్షణ ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గలవారు ఇండియా స్కిల్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.