Ganja : హైదరాబాద్‌లో ఇద్దరు గంజాయి వ్యాపారుల అరెస్ట్.. 7.2 కేజీల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఇద్దరు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్‌లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్
- By Prasad Published Date - 09:06 PM, Fri - 17 March 23

హైదరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులు ఇద్దరు గంజాయి వ్యాపారులను అరెస్ట్ చేశారు. మాదాపూర్ జోన్‌లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) సిబ్బంది, జీడిమెట్ల పోలీసులు సంయూక్తంగా ఇద్దరిని పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల వద్ద నుంచి 7.2 కిలోల ఎండు గంజాయి, రెండు మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు శంషీగూడలోని ఎల్లమ్మబండలో నివాసం ఉంటున్న ఎ.మోహన్ గా పోలీసులు గుర్తించారు. మోహన్ స్వస్థలం గుంటూరు జిల్లా దాచేపల్లి నారాయణపురంగా గుర్తించారు.మరో నిందితుడు హైదరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన బి. యశ్వంత్ (విక్రేత), వైజాగ్‌కు చెందిన శ్యామ్‌కుమార్ ప్రధాన సరఫరాదారుగా గుర్తించారు. నిందితుల్లో ఒకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరైన శ్యామ్‌కుమార్ గత మూడేళ్లుగా వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా గంజాయిని తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Related News

KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..
ఢిల్లీ లిక్కర్ హడావిడి తగ్గడంతో జాతీయ రాజకీయాల వైపు మళ్లీ కేసీఆర్ దూకుడు పెంచారు. మహారాష్ట్ర లోని లోహ ప్రాంతంలో ఈ నెల 26 న బీ ఆర్ ఎస్ సభ పెట్టె..