Skin Care: మీ అందమైన చర్మం కోసం అయిదు టిప్స్
- By hashtagu Published Date - 11:37 AM, Sat - 13 March 21
అందంగా, ఆరోగ్యాంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు ? అందంగా కనిపించాలని కొందరు బ్యూటీ పార్లర్ కు వెళ్తుంటారు మరి కొందరు స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు ఇంకా కొందరైతే స్కిన్ ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు. కానీ మన చర్మానికి ఏది మంచి చేస్తుంది ఏది హాని కలిగిస్తుంది అని కొందరికి మాత్రమే తెలుసు. అందుకే మన hashtagu మీ కోసం, మీ అందమైన చర్మం కోసం కొన్ని టిప్స్ ను మీ ముందుకు తీసుకువచ్చింది. మన చర్మానికి హాని కలిగించే ఆ అయిదు ఏంటో తెలుసుకుందాం.
1. సన్ లైట్
సన్ లైట్ లో అనేక రేడియేషన్స్ ఉంటాయి ఇవి చర్మం మీద పడటం వల్ల స్కిన్ మెరుపు పోయి నిర్జీవంగా తయారవుతుంది( హైపర్ పిగ్మెంటేషన్) చర్మం నలుపు రంగుకు మారడానికి కూడా ఇదొక కారణం. ఉదయం 7గంటల లోపు సన్ లైట్ లో UVA, బ్లూ లైట్స్ తక్కువగా ఉంటాయి ఆ సమయంలోని లైట్ స్కిన్ కు మంచిది పైగా విటమిన్ డి కూడా చర్మానికి చాల ముఖ్యం.
2. షుగర్
షుగర్ గ్లైకేషన్ ను వేగవంతం చేస్తుంది. మన చర్మాన్ని సున్నితంగా, టైట్ గా ఉండటానికి కొల్లాజెన్ ఫైబర్స్ కీలక పాత్రా పోషిస్తాయి. ఆ కొల్లాజెన్ ఫైబర్స్ వీక్ అవ్వడం వల్ల చర్మం ముడతలు పడుతుంది.. దీన్నే గ్లైకేషన్ అని అంటారు. సాధారణంగా గ్లైకేషన్ వయసు మీద పడేకొద్దీ వేగవంతం అవుతుంది. కానీ వయసుతో సంబంధం లేకుండా షుగర్ గ్లైకేషన్ ప్రాసెస్ ను వేగవంతం చేస్తుంది అందుకే షుగర్ పదార్థాలకు దూరంగా ఉండాలి.
3. పొల్యూషన్
పొల్యూషన్ కారణంగా జుట్టు మాత్రమే పోవడం కాదు.. అనేక స్కిన్ సెల్స్ ను డామేజ్ చేసి స్కిన్ గ్లో ను తగ్గిస్తుంది. అందుకే సిటీల్లో ఉండే వాళ్లు పొల్యూషన్ నుండి తమ చర్మాన్నికాపాడుకునేందుకు అనేక జాగ్రత్తలు పాటించాలి.
4. స్ట్రెస్
స్ట్రెస్ కారణంగా జుట్టు రాలిపోతుందని మనందరికి తెలుసు. స్ట్రెస్ కారణంగా కార్టిసోల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ వల్ల
చర్మం పై పింపుల్స్ , డార్క్ సర్కిల్స్ రావడం జుట్టు రాలిపోవడం జరుగుతుంది. చర్మం కూడా ముడతలు పడుతుంది. రోజు 20 నిమిషాల వరకు ధ్యానం, వ్యాయామం చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది.
5. స్మోకింగ్ (ధూమపానం)
మీకు ఆరోగ్యమైన చర్మం కావాలంటే పొగాకుకు దూరంగా ఉండాలి. స్మోకింగ్ వల్ల కూడా కొల్లాజెన్ ఫైబర్స్ దెబ్బతింటాయి ఫలితంగా డార్క్ సర్కిల్స్, చర్మం ముడతలు పడి వయసు ఎక్కువగా కనిపిస్తుంది.
ప్రముఖ డెర్మటాలొజిస్ట్ లు కూడా ఈ అయిదు కారణాలవల్ల చర్మ సమస్యలు వస్తాయి అని సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పుకొచ్చారు.
Related News
Diabetes: అమ్మో.. మధుమేహం.. ఈ అలవాట్లు ఉంటే వెంటనే చెక్ పెట్టండి
Diabetes: రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు మధుమేహం వస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే దీనికి చికిత్స లేదు. ఇది మాత్రమే నియంత్రించబడుతుంది. 2021 సంవత్సరంలో విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 537 మిలియన్లు అంటే 20-79 సంవత్సరాల వయస్సు గల 53.7 కోట్ల మందికి పైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. 2045 నాటికి, ఈ సంఖ్య 783 మిలియన్లకు అంటే 78.3 కోట్లకు పెరుగుతుందన�