Gujarat: గుజరాత్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం 100 రోగులు సురక్షితం
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 100 మంది రోగులను ఆస్పత్రి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు
- Author : Praveen Aluthuru
Date : 30-07-2023 - 10:51 IST
Published By : Hashtagu Telugu Desk
Gujarat: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 100 మంది రోగులను ఆస్పత్రి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. నగరంలోని సాహిబాగ్ ప్రాంతంలో ఉన్న రాజస్థాన్ హాస్పిటల్ బేస్‌మెంట్‌లో తెల్లవారుజామున 4.30 గంటలకు మంటలు చెలరేగాయని సాహిబాగ్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఆసుపత్రిని చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తుంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ MD చంపావత్ మాట్లాడుతూ, “అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. మంటలు చెలరేగిన ఆసుపత్రి బేస్‌మెంట్ నుండి పొగలు వస్తున్నాయాని తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Gujarat | Fire breaks out at a hospital in Ahmedabad's Sahibaug area. Around 20-25 fire tenders on the spot. pic.twitter.com/qCoFvUKZyt
— ANI (@ANI) July 30, 2023
Also Read: Warangal Rains: వరంగల్ లోని బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ కు గండి