fire Accident: దారుణం.. ఆరుగురు సజీవదహనం
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం (fire Accident) సంభవించింది. గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు (fire Accident) చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు.
- Author : Gopichand
Date : 17-12-2022 - 6:46 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం (fire Accident) సంభవించింది. గ్రామంలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు మంటలు (fire Accident) చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి ఓ ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఇంటి యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కూతురు మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలు, మరో వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పగా.. ప్రమాదానికి గల కారణాలపై డీసీపీ అఖిల్ మహాజన్ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం సంభవించడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకుని విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన తెలిపారు.