Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. 25 ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం (వీడియో)..!
ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది.
- Author : Gopichand
Date : 31-03-2023 - 10:37 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని వజీర్‌పూర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. ఇక్కడ ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు చాలా ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. వజీర్‌పూర్ ఇండస్ట్రియల్ ఏరియా జేడీ ధర్మకాంత సమీపంలోని ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖకు చెందిన 25 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి. మంటలను ఆర్పేందుకు యత్నాలు కొనసాగుతున్నాయి. విషయం తెలిసిన వెంటనే సీఎం కేజ్రీవాల్ ఘటన స్థలానికి వెళ్లారు. ఘటనకు గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Earthquake: చిలీలో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
#WATCH | Delhi: Fire breaks out in a factory in Wazirpur area. 25 fire tenders rushed to the site.
Details awaited. pic.twitter.com/OHQxxxrVTR
— ANI (@ANI) March 31, 2023