Pratyusha Garimella : కార్బన్ మోనాక్సైడ్ పీల్చి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సూసైడ్..!!
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ప్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తోన్న గరిమెళ్ల ప్రత్యుష్య తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
- Author : hashtagu
Date : 11-06-2022 - 7:37 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ లో విషాదం నెలకొంది. ప్యాషన్ డిజైనింగ్ రంగంలో రాణిస్తోన్న గరిమెళ్ల ప్రత్యుష్య తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. డిప్రెషన్ కు గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈక్రమంలో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
అయితే ప్రత్యూష ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్ ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ప్రత్యుష గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తన ఇంట్లో బాత్ రూంలో ప్రత్యూష విగతజీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. ప్రత్యూష మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.