Fake Currency : కోల్‌కతా భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత.. పోలీసులు అదుపులో ఇద్దరు నిందితులు
కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. అస్సాంకు చెందిన ఇద్దరి వద్ద నుంచి
- By Prasad Published Date - 04:37 PM, Tue - 31 January 23

కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా నకిలీ కరెన్సీని పట్టుకున్నారు. అస్సాంకు చెందిన ఇద్దరి వద్ద నుంచి రూ.10లక్షల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు. సెంట్రల్ కోల్‌కతా ప్రాంతంలోని ఎస్ప్లానేడ్ నుండి నిందితులను అబ్దుల్ రెజ్జాక్ ఖాన్, షహర్ అలీగా గుర్తించారు. నిందితులిద్దరూ అస్సాంకు చెందిన ఫేక్ కరెన్సీ డీలర్లని ఎస్టీఎఫ్ పేర్కొంది. పక్కా సమాచారం మేరకు STF యొక్క యాంటీ-ఎఫ్‌ఐసిఎన్ బృందం ఇద్దరు నిందితులను మైదాన్ పిఎస్ పరిధిలోని సెంట్రల్ కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ ప్రాంతానికి సమీపంలోని డఫెరిన్ రోడ్, మాయో రోడ్ క్రాసింగ్ వద్ద పట్టుకుంది. ఈ సోదాల్లో ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 లక్షల విలువైన 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన కోల్‌కతా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Related News

Road Accident : మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు విద్యార్థులు మృతి
మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనం ట్రాక్టర్ ట్రాలీని ఢీకొనడంతో ఇద్దరు