Train Derailment Attempt: పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం.. తప్పిన ప్రమాదం!
లోకో పైలట్ చూడకుంటే పెద్ద రైలు ప్రమాదం జరిగి ప్రయాణికులు మృత్యువాత పడి ఉండేవారు. ఘటనపై రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు, పోలీసులు, జీఆర్పీ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న ఇనుప స్తంభం తొలగించి రైలును పంపించారు.
- By Gopichand Published Date - 09:18 AM, Fri - 20 September 24

Train Derailment Attempt: భారతీయ రైల్వేకు చెందిన మరో రైలును బోల్తా కొట్టించే ప్రయత్నం జరిగింది. ఉత్తరప్రదేశ్- ఉత్తరాఖండ్ సరిహద్దులోని బిలాస్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలోని రైల్వే ట్రాక్‌పై (Train Derailment Attempt) ఇనుప స్తంభం కనుగొనబడింది. లోకో పైలట్ స్తంభాన్ని చూసి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో ప్రమాదం తప్పింది. లోకో పైలట్ అప్రమత్తతతో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఉత్తరాఖండ్‌లోని రుద్రపూర్ వద్ద పట్టాలపై 6 మీటర్ల ఇనుప స్తంభం ఉన్నట్లు లోకో పైలట్ గుర్తించాడు. ఎమర్జెన్సీ బ్రేకులు అప్లై చేసి రైలును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పోల్ తీసేసిన తర్వాత రైలు అక్కడి నుంచి ముందుకు కదిలింది.
లోకో పైలట్ చూడకుంటే పెద్ద రైలు ప్రమాదం జరిగి ప్రయాణికులు మృత్యువాత పడి ఉండేవారు. ఘటనపై రైల్వే అధికారులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు, పోలీసులు, జీఆర్పీ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్‌పై ఉన్న ఇనుప స్తంభం తొలగించి రైలును పంపించారు. రైలు దాదాపు 20 నిమిషాల ఆలస్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. రైల్వే మంత్రిత్వ శాఖ కూడా నివేదిక కోరింది. రుద్రాపూర్- బిలాస్‌పూర్ అవుట్‌పోస్టు ఇన్‌చార్జి అమిత్ కుమార్ ఘటనను ధృవీకరించారు.
Also Read: Urvashi Rautela: రిషబ్ పంత్‌తో ఉర్వశి రౌతేలా డేటింగ్.. క్లారిటీ ఇచ్చేసింది..!
ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు
మీడియా కథనాల ప్రకారం.. రుద్రపూర్ సరిహద్దు సమీపంలోని బల్వంత్ ఎన్‌క్లేవ్ కాలనీ వెనుక రైల్వే లైన్‌లో ట్రాక్ నంబర్ 45/10పై 45/10, 11 మధ్య భారీ ఇనుప స్తంభాన్ని ఉంచారు. కత్గోడం డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12091 డెహ్రాడూన్ నుండి కత్గోడంకు తిరిగి వెళుతోంది. ఎక్స్‌ప్రెస్ రైలు రుద్రాపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉండగా అప్పటికే 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తోంది. రైలు రుద్రాపూర్ ఉత్తరాఖండ్ రైల్వే స్టేషన్‌కు ఆలస్యంగా చేరుకుంది. అప్పుడే రైలు లోకో పైలట్ ఈ విషయం గురించి స్టేషన్ సూపరింటెండెంట్, GRP పోలీసులకు పూర్తి సమాచారం అందించాడు. సీఓ రవి ఖోఖర్, ఇన్‌స్పెక్టర్ ఇన్‌స్పెక్టర్ బల్వాన్‌సింగ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విద్యాకిషోర్ మిశ్రా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. రైలు మొత్తం మార్గంలో ట్రాక్‌లను తనిఖీ చేయమని కోరుతూ ఆదేశాలు జారీ చేశారు.
రైల్వే శాఖలోని అన్ని విభాగాలు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశాయి
రాంపూర్-కత్‌గోడం రైల్వే లైన్‌లో రైలును బోల్తా కొట్టేందుకు కుట్ర జరిగిందని రైల్వే ఎస్పీ అశుతోష్ శుక్లా తెలిపారు. ఇందుకోసం పట్టాల మధ్యలో స్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఆ పిల్లర్‌ని రైలు ఢీకొట్టి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది. సీఓ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రైల్వే నిఘా సంస్థ కూడా దర్యాప్తు ప్రారంభించింది. రైల్వే ట్రాక్ చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.