Viveka Murder : వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడిని..?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడిని పెంచింది. కడపకు సీబీఐ ప్రత్యేక బృందం చేరుకుంది. మాజీ
- By Prasad Published Date - 09:58 AM, Fri - 14 April 23

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడిని పెంచింది. కడపకు సీబీఐ ప్రత్యేక బృందం చేరుకుంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గూగుల్ టేకౌట్ సాయంతో భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్‌ను సీబీఐ గుర్తించింది. హత్య జరిగిన రోజు అవినాష్, శివశంకర్ రెడ్డిలతో కలిసి ఉదయ్ ఉన్నాడని.. అంబులెన్స్‌లు, ఫ్రీజర్లు, వైద్య సిబ్బందిని సమకూర్చడంలో ఉదయ్ కీలక పాత్ర పోషించాడని సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే సీబీఐ అధికారులు ఉదయ్‌ని పలుమర్లు ప్రశ్నించారు.