Ex IAF Suicide : హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐఏఎఫ్ అధికారి ఆత్మహత్య.. ఇంట్లో..?
భారత వాయుసేన మాజీ అధికారి శివారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
- By Vara Prasad Updated On - 10:28 AM, Sat - 23 July 22

హైదరాబాద్: భారత వాయుసేన మాజీ అధికారి శివారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం బాగ్ లింగంపల్లిలోని తన నివాసంలో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన టి.శివారెడ్డి (44) అనే వ్యక్తి ఎయిర్‌ఫోర్స్‌లో సార్జెంట్‌గా, నాన్‌కమిషన్డ్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు.
విడాకులు తీసుకున్న అతడు హైదరాబాద్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా కుటుంబ సమస్యలతో శివారెడ్డి మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. అతను ఉదయం తన స్వస్థలం నుండి నగరానికి తిరిగి వచ్చాడు. అల్పాహారం సమయంలో పొరుగువారికి చివరిగా కనిపించాడు. అతను లోపలి నుండి తలుపు లాక్ చేసి, మధ్యాహ్నం సమయంలో బెడ్‌రూమ్‌లో తన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానిస్తున్నారు. శివారెడ్డి తన తలపై కాల్చుకున్నాడని.. బుల్లెట్ తలపై ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఉన్నాయని పోలీసులు తెలిపారు. శివరెడ్డి ఫోన్ లిప్ట్ చేయకపోవడంతో ఆయన సోదరి మహేశ్వరి వెళ్లి చూడగా ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు.
ఆమె కవాడిగూడలోని తన స్నేహితుడికి సమాచారం ఇవ్వగా, ఆమె సంఘటనా స్థలానికి చేరుకుని, వాచ్‌మెన్ సహాయంతో బలవంతంగా మెయిన్ డోర్ తెరిచింది.. ఇంట్లో మంచం మీద శివారెడ్డి శవమై పడి ఉన్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఘటనాస్థలానికి చేరుకున్న చిక్కడపల్లి పోలీసులు.. స్పాట్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. క్లూస్ టీమ్ బృందం కూడా నమూనాలను సేకరించింది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లేదని పోలీసులు తెలిపారు. బంధువులు, సహోద్యోగులను విచారించగా శివారెడ్డి తన వ్యక్తిగత జీవితంలోని సమస్యలపై కలత చెందాడని సూచించినట్లు, సాధ్యమైన అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
Related News

Traffic Diverted : శనివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు…వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న ట్రాఫిక్ పోలీసులు..!!
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది.