Sweet Potato: షుగర్ ఉన్నవారు చిలగడదుంపలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Sweet Potato: షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు చిలగడ దుంప తినవచ్చా, తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 30-11-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
Sweet Potato: చిలగడదుంప వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. దీనిని తరచుగా తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. కాగా చిలగడదుంపలు శక్తికి మూలం. ఉపవాస సమయంలో వాటిని తినడం వల్ల బలహీనత, అలసట వంటి సమస్యలు తగ్గుతాయని చెబుతున్నారు. చిలగడదుంపల్ని తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుందట. శరీరాన్ని సీజనల్ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు. అలాగే చిలగడదుంపల్లో విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట.
ఇవి వైరల్ ఇన్ఫెక్షన్లు, దగ్గు, జలుబు, ఫ్లూ నుంచి రక్షిస్తాయట. అయితే షుగర్ సమస్యతో బాధపడుతున్న వారు చిలగడదుంప తినవచ్చో, తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా శీతాకాలం వచ్చిందీ అంటే చాలు చిలగడదుంపలు మార్కెట్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిని చిన్నా, పెద్దా తేడా లేకుండా చాలా మంది ఇష్టంగా తింటుంటారు. శీతాకాలంలో దొరికే చిలగడదుంపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదీ. ఇవి చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంతోపాటు సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడతాయి. కాగా చిలగడదుంపలు రుచికరంగా ఉండటంతో పాటు పోషకాలతో నిండి ఉంటాయి. చాలా మంది వీటిని స్నాక్ ఐటమ్ గా తింటుంటారు.
చిలగడదుంపల్లో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు A, C, B6, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి. వీటిలో ఉండే బీటా కెరోటిన్ కళ్ళు, చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. అయితే షుగర్ ఉన్నవారు చిలగడ దుంపను హాయిగా తినవచ్చట. సాధారణ బంగాళాదుంపలతో పోలిస్తే వీటికి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే అవి రక్తంలో చక్కెర స్థాయిలపై స్వల్ప ప్రభావాన్ని చూపుతాయట. చిలగడదుంపల్లోని ఫైబర్ కంటెంట్ చక్కెర శోషణను నెమ్మదింపజేయడానికి సహాయపడుతుందట. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుందని చెబుతున్నారు. మధుమేహం ఉన్న వ్యక్తులు మితంగా, సమతుల్య ఆహారంలో భాగంగా చిలగడదుంపలను తీసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు.
అంతేకాకుండా వండే పద్ధతి కూడా చాలా ముఖ్యం అని చెబుతున్నారు. ఉడికించి, నిప్పుల మీద కాల్చుకుని చిలగడదుంపల్ని తినవచ్చట. అయితే వాటి మీద ఎలాంటి టాపింగ్స్, పదార్థాలు వాడకూడదట. ఉడికించుకుని లేదా కాల్చుకుని అలానే తినాలని, వేరే వాటితో కలిపి తింటే షుగర్ పెరిగే ప్రమాదం ఉంది అని చెబుతున్నారు. షుగర్ పేషెంట్స్ కాల్చిన చిలగడదుంప అయితే సగం లేదా 50 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదట. ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ అదుపు తప్పుతాయని, సగం చిలగడదుంపను ఆస్వాదించవచ్చని,ఇక ఉడికించి తినాలనుకుంటే చిలగడదుంపల్ని కనీసం ముప్పై నిమిషాలు ఉడికించాలని,ఆ తర్వాత వాటిని తినాలని చెబుతున్నారు. మామలుగానే చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి. దీంతో శరీరానికి తగినంత వేడి అవసరం. చిలగడదుంపలు సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటాయి. ఇవి క్రమంగా శక్తిని అందిస్తాయట. ఈ శక్తి శరీరాన్ని ఎక్కువసేపు చురుగ్గా ఉంచుతుందని, చలిలో అలసట లేదా బలహీనతను నివారిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా చిలగడదుంపలు సహజ చక్కెరలతో నిండి ఉంటాయట. చిలగడదుంపలు తినడం వల్ల శరీరం లోపల నుంచి వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుందట. సాధారణ వ్యక్తులు ప్రతిరోజూ 100 నుంచి 150 గ్రాముల చిలగడదుంపలు తినాలని చెబుతున్నారు.