Burnt To Death: ఢిల్లీలోని జైత్‌పూర్ లో విషాదం.. మద్యం మత్తులో వ్యక్తి సజీవ దహనం
ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న మధు విశ్వాస్ అనే వ్యక్తి సజీవ (Burnt To Death) దహనమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. టైల్స్ పని చేసే మధు మద్యం మత్తులో మంట దగ్గరికి వెళ్ళాడు. ఈ క్రమంలో అతని బట్టలకు మంట అంటుకోవడం (Clothes Catch Fire)తో అతను సజీవదహనమయ్యాడు.
- Author : Gopichand
Date : 29-12-2022 - 6:44 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీలోని జైత్‌పూర్ ప్రాంతంలో ఘోరం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న మధు విశ్వాస్ అనే వ్యక్తి సజీవ (Burnt To Death) దహనమయ్యాడు. వివరాల్లోకెళ్తే.. టైల్స్ పని చేసే మధు మద్యం మత్తులో మంట దగ్గరికి వెళ్ళాడు. ఈ క్రమంలో అతని బట్టలకు మంట అంటుకోవడం (Clothes Catch Fire)తో అతను సజీవదహనమయ్యాడు. పూర్తిగా కాలిపోయి ఉన్న అతని మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. అతని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాధితుడు మధు విశ్వాస్ తన ఇద్దరు కుమారులతో కలిసి టైల్స్ స్థలంలో కూలీగా పనిచేస్తున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరినగర్ ఎక్స్‌టిఎన్‌ఎలోని ఇంటి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక వ్యక్తికి కాలిన గాయాలు గురించి జైత్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు బుధవారం ఉదయం 10:30 గంటలకు పిసిఆర్ కాల్ రావడంతో సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రైమ్ టీమ్.. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందాలను సంఘటనా స్థలానికి పిలిచి తనిఖీ చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. తదుపరి విచారణ పురోగతిలో ఉంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.