HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Drdo Scientist Revealed Missile Secrets To Pak Spy Agent

DRDO Scientist Vs Pak Spy : మిస్సైల్స్ సీక్రెట్స్ లీక్.. పాక్ మహిళా ఏజెంట్ కు చెప్పేసిన సైంటిస్ట్

DRDO Scientist Vs Pak Spy : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ).. ఇది మనదేశ రక్షణ పరిశోధన రంగానికి ఆయువు పట్టు. ఈ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోంది.. 

  • By Pasha Published Date - 12:03 PM, Sat - 8 July 23
  • daily-hunt
Drdo Scientist Vs Pak Spy
Drdo Scientist Vs Pak Spy

DRDO Scientist Vs Pak Spy : డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ).. ఇది మనదేశ రక్షణ పరిశోధన రంగానికి ఆయువు పట్టు. 

ఈ ఆయువు పట్టుపై దెబ్బ కొట్టేందుకు పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్రలు పన్నుతోంది.. 

ఈక్రమంలోనే  డీఆర్‌డీఓలోని శాస్త్రవేత్తలు టార్గెట్ గా హనీ ట్రాపింగ్ కు పాల్పడుతోంది.. 

ఈ ప్రయత్నంలో పాక్ మహిళా గూఢచారి వలకు సాక్షాత్తూ మహారాష్ట్రలోని పూణెలో ఉన్న డీఆర్‌డీఓకు చెందిన ఒక  ల్యాబ్‌ లో డైరెక్టర్ గా వ్యవహరించిన శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ చిక్కాడు..  మే 3నే శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ ను మహారాష్ట్ర  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్టు చేయగా, తాజాగా ఈ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ ను(DRDO Scientist Vs Pak Spy)  దాఖలు చేసింది.  అందులోని కీలక వివరాలు  ఇలా ఉన్నాయి.. 

నగ్న వీడియోలను పంపి.. 

జారా దాస్‌గుప్తా.. ఈ పేరుతో ఒక అమ్మాయి నైస్ గా మాట్లాడుతూ DRDO శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ కు వాట్సాప్ లో టచ్ లోకి వచ్చింది. ” నేను బ్రిటన్ లో ఉండే ఇండియన్ ను. పేరు జారా దాస్‌గుప్తా. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ గా పనిచేస్తున్నాను” అని చెప్పి పరిచయం చేసుకుంది.  శాస్త్రవేత్త ప్రదీప్ ను మాయ మాటల  చాటింగ్ తో అట్రాక్ట్ చేసి క్లోజ్  ఫ్రెండ్ గా మారింది.  మాటల్లో పెట్టి .. ఎక్కడికి వెళ్తున్నారు ? ఏం చేస్తున్నారు ? అని అడగడం మొదలుపెట్టింది. ఆ లొకేషన్లు పంపండి.. ఆ ఫోటోలు పంపండి.. అని కూడా ఆ అమ్మాయి ముద్దుగా చెప్పేది..  శాస్త్రవేత్త ప్రదీప్ కాదనలేక వెంటనే అవన్నీ ఆమెకు ఫార్వర్డ్ చేసేవారు. కొంతకాలం తర్వాత తన అట్రాక్టివ్ ఫోటోలను, నగ్న వీడియోలను కూడా ఆ అమ్మాయి(జరా దాస్‌గుప్తా) వాట్సాప్ లో పంపడం మొదలు పట్టింది. వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసి మాట్లాడటం కంటిన్యూ చేసింది.. దీంతో  శాస్త్రవేత్త ప్రదీప్ కురుల్కర్ కూడా క్లోజ్ అయ్యారని ఏటీఎస్ తన చార్జిషీట్‌లో వివరించింది.

Also read : Constitution Framers Words On UCC : యూసీసీపై రాజ్యాంగ నిర్మాతలు ఏమన్నారో తెలుసా?

అడగరానిది అడిగినా చెప్పేశాడు 

జారా దాస్‌గుప్తా అడగరాని సమాచారాన్ని కూడా శాస్త్రవేత్త ప్రదీప్ ను అడగడం ప్రారంభించింది. బ్రహ్మోస్ లాంచర్.. డ్రోన్.. UCV.. అగ్ని క్షిపణి లాంచర్ .. భారత  మిలిటరీ బ్రిడ్జింగ్ సిస్టమ్‌కు సంబంధించిన రహస్యాలను చెప్పాలని అడిగింది. వాటికి సంబంధించి ఉన్న డాక్యుమెంట్స్ ను ఫార్వర్డ్ చేయాలని కోరింది. దేశ భద్రతతో ముడిపడి ఉన్న సమాచారాన్ని ఇతర దేశాలకు అందించడం చట్ట విరుద్ధం అని తెలిసినా .. ఆమె అడిగిన చాలా ఇన్ఫర్మేషన్ ను ఆయన చెప్పేశారని  మహారాష్ట్ర  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ దర్యాప్తులో గుర్తించారు. భూమి నుంచి ఆకాశం వైపు ప్రయోగించే క్షిపణులు (SAM), డ్రోన్‌లు, బ్రహ్మోస్ క్షిపణి లాంచర్లు, అగ్ని క్షిపణి లాంచర్లు, UCV వంటి టాపిక్స్ పై జారా దాస్‌గుప్తాతో శాస్త్రవేత్త ప్రదీప్ చాట్ చేశారు. వీరిద్దరూ 2022 జూన్ నుంచి 2022 డిసెంబర్ వరకు కాంటాక్ట్‌లో ఉన్నారని విచారణలో గుర్తించారు.

Also read : Chemical Weapons Big Announcement : అమెరికా రసాయన ఆయుధాలు ఖతం.. ఏమిటీ కెమికల్ వెపన్స్, బయో వెపన్స్ ?

2023 ఫిబ్రవరిలో నంబర్ బ్లాక్ చేసినా .. 

2023 ఫిబ్రవరిలో తనపై DRDO అంతర్గత దర్యాప్తును ప్రారంభించగానే.. అలర్ట్ అయిన శాస్త్రవేత్త ప్రదీప్ ఫోన్, వాట్సాప్ లో జారా దాస్‌గుప్తా నంబరును బ్లాక్ చేశారని ఇన్వెస్టిగేషన్ లో తేలింది.  దీంతో వెంటనే జారా దాస్‌గుప్తా మరో నంబర్ నుంచి శాస్త్రవేత్త ప్రదీప్ కు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపింది.  ‘మీరు నా నంబర్‌ను ఎందుకు బ్లాక్ చేశారు ?’ అని  ప్రశ్నించింది. విచారణలో భాగంగా మహారాష్ట్ర  యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) జారా దాస్‌గుప్తా  ఐపీ అడ్రస్ ను ట్రాక్ చేయగా.. లొకేషన్ ను  పాకిస్థాన్‌ లో చూపించిందని ఏటీఎస్ తన చార్జిషీట్‌లో వెల్లడించింది. జారా దాస్‌గుప్తా  పేరుతో చాట్ చేసింది పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ హనీ ట్రాప్  ఏజెంట్ అని బహిర్గతమైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • crime
  • DRDO Scientist
  • DRDO Scientist Vs Pak Spy
  • Missile Secrets  leaked
  • Pak Spy Agent
  • Pradeep Kurulkar
  • whatsapp
  • Zara Dasgupta

Related News

    Latest News

    • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

    • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

    • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

    • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

    • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd