HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Doctorate To Brsv Leader Velpukonda Venkatesh

Velpukonda Venkatesh: BRSV నాయకుడు వేల్పుకొండ వెంకటేష్ కు డాక్టరేట్

‘తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం- కరపత్ర సాహిత్యము’ అనే అంశం మీద వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh) పరిశోధన చేశారు.

  • Author : Balu J Date : 18-02-2023 - 5:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venkatesh
Venkatesh

ఉస్మానియా విశ్వవిద్యాలయం (Osmania University) తెలుగు శాఖలో ‘తెలంగాణ రాష్ట్ర నిర్మాణ ఉద్యమం- కరపత్ర సాహిత్యము’ అనే అంశం మీద వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh) పరిశోధన చేశారు. ఇందుకుగాను యూనివర్సిటీ అధికారులు పీహెచ్డీ పట్టాను ఇచ్చారు కరపత్ర సాహిత్యం ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నది. వివిధ ఉద్యమాల ప్రచారానికి కరపత్రమే ఆధారమైంది. ఫ్రెంచి విప్లవం మొదలుకొని భారతదేశ స్వతంత్ర పోరాటం వరకు కరపత్రం ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి ప్రధాన భూమికను పోషించింది.

తెలుగు నేలమీద కరపత్ర రచన ఒక సాహిత్య ప్రక్రియగా మారింది.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నక్సలైట్ ఉద్యమం, 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పోరాటం వివిధ అస్థిత్వ ఉద్యమాల సందర్భంలో కరపత్రం పోషించిన పాత్రను మనం విస్మరించలేము. కానీ ఇంతటి ప్రాధాన్యం కలిగిన కరపత్ర సాహిత్యం పైన ఇప్పటి వరకు ఒక్క పరిశోధన కూడా జరగలేదు. ఈ లోటును పూరించడం కోసం వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh) అనే పరిశోధకుడు పూనుకొని ఆరు సంవత్సరాల పాటు శ్రమించి కరపత్ర సాహిత్యాన్ని సేకరించి పరిశోధన పూర్తి చేశాడు. కరపత్రాన్ని ముద్రించి ఆ తర్వాత మరచిపోవడం అన్ని ఉద్యమ సందర్భాలలో మనం గమనిస్తూ ఉంటాం. అట్లా విస్మరణకు గురైన వివిధ రకాల కరపత్రాలను సేకరించి, విశ్లేషించి క్రమ పద్ధతిలో వెంకటేష్ పరిశోధన చేశాడు.

తెలంగాణ ఉద్యమంలో స్వయంగా ఈ పరిశోధకుడు పాల్గొని రాష్ట్రం సిద్ధించాక పరిశోధనలు పూర్తి చేయడం సంతోషించదగిన విషయం. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, చీకటాయపాలెం గ్రామంలో పేద, దళిత కుటుంబంలో తల్లిదండ్రులు వెంకటమ్మ, వెంకటయ్య లకు ఐదుగురు సంతానంలో మొదట పుట్టిన వేల్పుకొండ వెంకటేష్ (Velpukonda Venkatesh), ఓయూ జే ఏ సీ కన్వీనర్ , BRSV రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కు డాక్టర్ పట్టా పొందడం ఈ ప్రాంతానికి గర్వకారణమని ప్రాఫెస్సర్స్, గురువులు గ్రామ ప్రజలు, స్నేహితులు, శ్రేయోభిలాషులు తదితులు అందరూ శుభాకాoక్షలు తెలియజేశారు.

Also Read: Rats Eat Cannabis: గంజాయి తిన్న ఎలుకలు.. కేరళ కోర్టు తీర్పులో బిగ్ ట్విస్ట్!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • doctorate
  • Osmania Univesity
  • telangana
  • Velpukonda Venkatesh

Related News

Pavan Kalyan (1)

JSP : హైద‌రాబాద్‌లో జ‌న‌సేన స‌భ‌కు పోలీసుల అనుమ‌తి నిరాక‌ర‌ణ‌

రేపు (జూన్ 2వ) గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్‌లో జరగాల్సిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నవ నిర్మాణ సంకల్ప సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. తెలంగాణ రాజకీయ రంగంలో పార్టీ ఉనికిని బలోపేతం చేసే లక్ష్యంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్‌కు రానున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 2,000 మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొంటార

  • Heavy Rain Forecast for Telangana

    Weather Report: తెలంగాణకు భారీ వర్షసూచన

  • T Congress

    Congress : ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ.. తెలంగాణ రాజకీయాలు, ప్రభుత్వ కార్యక్రమాలపై చర్చ

  • Komatireddy

    Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • Jaggareddy

    TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

Latest News

  • Annamalai: బీజేపీకి అన్నామలై రాజీనామా

  • Kangana Ranaut: కంగనా రిక్వెస్ట్.. నేషనల్ క్రష్ ట్యాగ్‌ను అంగీకరించని నటి గిరిజా ఓక్

  • Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

  • Krunal Pandya: ఐపీఎల్‌లో ఐదోసారి కప్పు కొట్టిన కృనాల్ పాండ్యా

  • Dental Tips: ఏ వయసులో దంతాలు బలహీనమవుతాయి? దీనికి కారణం ఏంటో తెలుసా?

Trending News

    • Nandu’s World Nandana: మా మీద కావాలనే కుట్ర.. డబ్బులిచ్చి సోషల్ మీడియా లో దుష్ర్పచారం Nandu’ s world సంచలనం

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd