HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Daggubati Purandeswari As Tdp Mp Candidate Bjp In Trouble

AP Politics: టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పురద్రేశ్వరి? బీజేపీలో ముసలం!

దాదాపు రెండు దశాబ్దాలుగా మాటల్లేని భువనేశ్వరి, పురంధరేశ్వరి (Daggubati Purandeswari) ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు.

  • By CS Rao Published Date - 01:38 PM, Sat - 18 February 23
  • daily-hunt
Ntr And Purandeshwari
Ntr And Purandeshwari

Daggubati Purandeswari: ఏపీ బీజేపీకి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గా పురందేశ్వరి గుడ్ బై చెబుతారని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. ఒక వేళ ఆమె పార్టీ మారితే టీడీపీ లోకి వెళ్లే అవకాశం ఉంది. దాదాపు రెండు దశాబ్దాలుగా మాటల్లేని భువనేశ్వరి, పురంధరేశ్వరి (Daggubati Purandeswari) ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. పైగా దగ్గుబాటి వెంకటేశ్వరావు రాజకీయాలకు స్వస్తి పలికారు. ఆయన కుమారుడు హితేష్ చెంచురాం ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దీంతో భవిష్యతులో కూడా నారా కుటుంబ రాజకీయ వారసత్వానికి దగ్గుబాటి ఫామిలీ పోటీకాదు. అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పురంధరేశ్వరి అవసరాన్ని ఉపయోగించుకోవాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు. ఆమెను ఒంగోలు లేదా విశాఖ ఎంపీగా టీడీపీ (TDP) తరపున పోటీ చేయించాలని బాబు అంతరంగంగా ఉందని టీడీపి వర్గాల్లోని టాక్. అవసరమైతే విజయవాడ నుంచి ఎంపీ గా దింపాలని టీడీపీ అధిష్టానం స్కెచ్ వేస్తోంది.

ప్రస్తుతం ఆమెకు ఢిల్లీ బీజేపీ నేతలతో ఎలాంటి సమస్య లేదు. కానీ ఒంటరిగా బీజేపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే ఆమె రాజకీయం మరోసారి వెనక్కు వెళుతుంది. టీడీపీతో పొత్తు ఉంటేనే బీజేపీ, జనసేన భవిష్యత్తు. లేదంటే ఆ రెండు పార్టీలకు డిపాజిట్లు కూడా చాలా చోట్ల రావని ఆ పార్టీలకు తెలుసు. అందుకే టీడీపీతో కలసి వెళ్లాలనే ప్రయత్నం జరుగుతుంది. అది ఫలిస్తే ఆమె పార్టీ మారే అవకాశం ఉండదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ, జనసేన (Janasena) కలిసి ఎన్నికలకు వెళ్తాయని సర్వత్రా వినిపిస్తుంది. అందుకే పురద్రేశ్వరి పార్టీ మారతారని టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఙివియల్ మాటలతో ఆమె మనస్తాపం చెందారు. ప్రత్యామ్నాయ అంశాల్ని ఆమె పరిశీలిస్తున్నారని తెలుస్తుంది.

పురందేశ్వరికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. తన తండ్రి ఎన్టీఆర్ (NTR) పేరు జిల్లాకు పెట్టటం పైన తాజా గా పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. జీవీఎల్ ఈ మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ల అంశం రాజ్యసభలో ప్రస్తావించటంతో పాటుగా ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. విశాఖలో తాజాగా విజయవాడలో కాపు నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ – వైఎస్సార్ పేర్లు గురించి ప్రస్తావించారు. దీనికి పురందేశ్వరి స్పందించారు. జీవీఎల్ వ్యాఖ్యలకు సమాధానంగా ‘ఆ ఇద్దరు… మహానుభావులు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎన్టీఆర్ – వైఎస్సార్ పథకాలు..ప్రత్యేకతను వివరించారు. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పుడు జీవీఎల్ (GVL) చేసిన వ్యాఖ్యలతో పురందేశ్వరి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

ఏపీలో విశాఖ సీటు పైన జీవీఎల్ ఫోకస్ చేసారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసే ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. కానీ, జీవీఎల్ మాత్రం దేశ వ్యాప్తంగా బీజేపీ గెలిచే అవకాశం ఉన్న సీట్ల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారని..అందులో విశాఖ కూడా ఉందని చెబుతున్నారు. పార్టీ నిర్ణయం మేరకే విశాఖ పైన నేతలు ప్రత్యేకంగా చూస్తున్నారని వివరించారు. గతంలో విశాఖ నుంచి 2009 ఎంపీగా బీజేపీ తరపున గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అక్కడ నుంచే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పురందేశ్వరి (Daggubati Purandeswari) ఒకింత అసహనంతో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక..పార్టీ నేతలు మాత్రం జరుగుతున్న పరిణామాల పైన స్పందించేందుకు ఆసక్తి చూపటం లేదు.

కాంగ్రెస్ లో సుదీర్ఘ కాలం కేంద్ర మంత్రిగా పని చేసిన పురందేశ్వరి రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టటం పైన తాజా గా పార్టీ ఎంపీ జీవీఎల్ చేసిన వ్యాఖ్యలకు పురందేశ్వరి కౌంటర్ ఇచ్చారు. జీవీఎల్ ఈ మధ్య కాలంలో కాపు రిజర్వేషన్ల అంశం రాజ్యసభలో ప్రస్తావించటంతో పాటుగా ఏపీలో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేసారు. విశాఖలో..తాజాగా విజయవాడ (Vijayawada)లో కాపు నేతలతో సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో ఎన్టీఆర్ – వైఎస్సార్ పేర్లు గురించి ప్రస్తావించారు. దీనికి పురందేశ్వరి స్పందించారు. జీవీఎల్ వ్యాఖ్యలకు సమాధానంగా ‘ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎన్టీఆర్ – వైఎస్సార్ పథకాలు..ప్రత్యేకతను వివరించారు. ఇప్పుడు ఈ ట్వీట్ పొలిటికల్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. బీజేపీ ఇప్పటి వరకు ఎప్పుడూ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. పైగా మోడీ (PM Modi) ఇప్పుడు జీవీఎల్ చేసిన వ్యాఖ్యలతో పురందేశ్వరి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అంటే, కన్నా లక్ష్మినారాయణ మాదిరిగా ఆమె పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.

Also Read: KTR on Modi: మోడీకి కేటీఆర్ పంచ్.. అబద్దాల్లోనూ ఫెయిల్ అంటూ కౌంటర్!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Elections
  • ap politics
  • ap tdp
  • Daggubati Purandeswari

Related News

Nara Lokesh

Nara Lokesh : ఢిల్లీలో ప్రధాని మోదీని కలవనున్న నారా లోకేశ్

Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

  • Language barriers should be removed to benefit future generations: Pawan Kalyan

    Pawan Kalyan : జీఎస్టీ సంస్కరణలపై డిప్యూటీ సీఎం పవన్ రియాక్షన్ ఇలా..!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd