Vande Bharat: వందే భారత్‌లో స్లీపర్ కోచ్ లు భలే ఉన్నాయే! ఫొటోలు వైరల్!!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమంగా విస్తరిస్తున్నారు.
- Author : Balu J
Date : 04-10-2023 - 1:54 IST
Published By : Hashtagu Telugu Desk
Vande Bharat: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను క్రమంగా విస్తరిస్తున్నారు. 2024 మార్చినాటికి వందే భారత్‌లో స్లీపర్ కోచ్‌లను తీసుకొచ్చేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వీటి లోపలి డిజైన్‌ను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు రైలు ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోనూ రెండు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పటి వరకు నడుస్తున్న వందే భారత్ రెండు క్లాసుల కోచ్ లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న ఆదరణకు అనుగుణంగా వందే భారత్ లో స్లీపర్ క్లాస్ ప్రవేశ పెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ప్రాధమిక కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి బీహెచ్ఈఎల్ ఆర్దర్ దక్కించుకుంది. రూ 120 కోట్ల ఖర్చుతో ఒక్కో రైళ్లో స్లీపర్ క్లాస్ లు సిద్దం చేయనుంది.
Concept train – Vande Bharat (sleeper version)
Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023