Cricket Fans Upset: నిలిచిపోయిన డిస్నీ హాట్ స్టార్ యాప్.. తీవ్ర నిరాశలో క్రికెట్ ఫ్యాన్స్!
దేశవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ హాట్‌స్టార్ (Disney Hotstar) యాప్ సేవలు నిలిచిపోయాయి.
- Author : Balu J
Date : 17-02-2023 - 5:41 IST
Published By : Hashtagu Telugu Desk
డిస్నీ హాట్ స్టార్ (Disney Hotstar) లాంటి యాప్స్ క్రికెట్ లవర్స్ కు చెప్పలేనంతగా ఎంజాయ్ మెంట్ ను అందిస్తున్నాయి. సినిమాలే కాదు.. ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ (Cricket Match) లను చూడొచ్చు. ఈ యాప్స్ మొబైల్ లో డౌన్ లోడ్ చేసుకుంటే చాలు.. ఏంచక్కా ఎక్కడినుండైనా క్రికెట్ మ్యాచ్ చూసేయొచ్చు. నిమిషాల్లో అప్ డేట్స్ తెలుసుకోవచ్చు. అయితే ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ రెండో టెస్టు జరుగుతున్న విషయం తెలిసిందే. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో రెండో టెస్ట్ మ్యాచ్ కోసం చాలామంది టీవీల ముందు, మొబైల్స్ లో మ్యాచ్ ను చూడటం మొదలుపెట్టారు.
అయితే దేశవ్యాప్తంగా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ డిస్నీ హాట్‌స్టార్ (Disney Hotstar) యాప్ సేవలు నిలిచిపోయాయి. దీనికితోడు ఇంటర్నెట్‌ను ట్రాక్ చేసే వెబ్‌సైట్ కూడా అంతరాయాన్ని చూపుతోంది. ఉదయం 11.46 గంటలకు మొదలైన అంతరాయం మధ్యాహ్నం 12.31 గంటలకు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. 519 మంది వినియోగదారులు క్రికెట్ మ్యాచ్ ను చూడలేకపోయారు. మధ్యాహ్నం 1.16 గంటల ప్రాంతంలో 455 మంది వినియోగదారులకు ఈ సంఖ్య కొద్దిగా తగ్గింది. ఢిల్లీలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియాల రెండో క్రికెట్ టెస్ట్ మ్యాచ్‌లో ఆటంకం ఏర్పడింది. దీంతో దేశవ్యాప్తంగా యాప్ (Disney Hotstar) యూజర్స్ తో పాటు క్రికెట్ లవర్స్ ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Australia All Out: భారత్ బౌలర్లు విజృంభణ.. 263 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్!