HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Differences Cropping Up Among Employees On Strike Call Off

AP Employees: సమ్మె విరమణపై ఉద్యోగుల్లో చీలిక

సమ్మె విరమణ ఉద్యోగుల మధ్య రచ్చ రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయులు ఫైర్ అవుతున్నారు. హెచ్ ఆర్ ఏ ను సచివాలయ ఉద్యోగుల వరకు పెంచుకోవటంపై గ్రామీణ ఉద్యోగులు మండిపడుతున్నారు.

  • Author : CS Rao Date : 06-02-2022 - 11:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ys Jagan Chalo Vijayawada
Ys Jagan Chalo Vijayawada

సమ్మె విరమణ ఉద్యోగుల మధ్య రచ్చ రేపుతోంది. సచివాలయ ఉద్యోగ సంఘ నేతలపై ఉపాధ్యాయులు ఫైర్ అవుతున్నారు. హెచ్ ఆర్ ఏ ను సచివాలయ ఉద్యోగుల వరకు పెంచుకోవటంపై గ్రామీణ ఉద్యోగులు మండిపడుతున్నారు. వాళ్ళ ఒత్తిడికి ఏపీటీఎఫ్ ఆందోళన కొనసాగుతుందని ప్రకటించింది. ఆ సంఘం కు చెందిన ఉద్యోగులు సమ్మెకు సై అంటున్నారు. పైగా సమ్మె విరమించినట్టు ప్రభుత్వం ప్రకటించిందని, తాము కాదంటూ ఆదివారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆందోళన ఉంటుందని ఏపీటీఎఫ్ వెల్లడించింది. దీంతో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక వచ్చింది.
డిమాండ్లు సాధనలో విఫలమయ్యాం, చీకటి ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ఏపీటీఎఫ్ దూకుడుగా ఉంది. చర్చలు సఫలమైనట్టు ప్రకటించిన ప్రభుత్వంకు వ్యతిరేకంగా కలిసివచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామన్న ఏపీటీఎఫ్ అంటోంది. ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని ఆవేదన చెందుతోంది. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చలు సఫలమైనట్టు ప్రభుత్వం చేసిన ప్రకటనపై ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉద్యోగుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరిపినా డిమాండ్లు సాధించుకోవడంలో విఫలమయ్యామని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్) అధ్యక్షుడు భానుమూర్తి, కార్యదర్శులు పాండురంగ వరప్రసాదరావు అన్నారు. సమ్మె విరమణ చీకటి ఒప్పందం తప్ప మరోటి కాదన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
అంతేకాదు, తమతో కలిసి వచ్చే సంఘాలతో ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దుపై చర్చల్లో ఎలాంటి నిర్ణయమూ జరగలేదని, హెచ్ఆర్ఏ శ్లాబులను పునరుద్ధరించలేకపోయామని అన్నారు. ఈ విషయంలో గ్రామీణ ఉద్యోగులకు బోల్డంత నష్టం జరుగుతుందన్నారు.
నిజానికి ఈ చర్చల్లో ఐఆర్ ఇచ్చిన తేదీ నుంచి మానిటర్ బెనిఫిట్ ఇవ్వాలనే డిమాండ్‌పై చర్చ జరగనే లేదన్నారు. అంతేకాదు, పీఆర్‌సీ నివేదికను చూడలేకపోయామన్నారు. తమ ప్రధాన డిమాండ్ అయిన ఫిట్‌మెంట్‌ను 27 శాతానికి పెంచుకోలేకపోయామని ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కొన్ని సంఘాలు ఆందోళన బాట పట్టాయి. మొత్తం మీద ఉద్యోగుల సంఘాల్లో సమ్మె విరమణ పై చీలిక కనిపిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • ap employees
  • strike call off

Related News

Steam rice to be available in ration shops soon: Minister Nadendla Manohar

Nadendla Manohar: రేషన్ దుకాణాల్లో త్వరలో స్టీమ్‌ రైస్‌: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో రేషన్ దుకాణాల ద్వారా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ చేస్తామని, ఈ ఏడాది మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతున్నామని, ఎన్‌సీసీఎఫ్ సహకారంతో 1,000 మినీ మార్టులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మినీ మార్టుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేస్తామన్నారు. ఆం

  • Good News for Drinkers: New Liquor Bottles

    AP Liquor: మందుబాబులకు గుడ్ న్యూస్.. కొత్త మద్యం సీసాలు

Latest News

  • Marriage: వివాహం జరగడం లేదని బెంగ పడుతున్నారా? అయితే 21 శనివారాలు ఈ పని చేయండి..!!

  • Mamata Banerjee: మమతా బెనర్జీ ఇంటికి సీఐడీ

  • Manjari Fadnnis: తన కుక్కను దారుణంగా కొట్టి చంపేశారు : నటి మంజరి ఫడ్నీస్ కన్నీళ్లు

  • Sunny Leone: సన్నీ లియోన్‌కు సీఐడీ నోటీసులు.. రూ.2,400 కోట్ల భారీ స్కామ్

  • Apache Helicopter: హోర్ముజ్ జలసంధిలో కుప్పకూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్!

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd