బీజేపీ కి వ్యతిరేకంగా పోరాడుతున్న ‘కేసీఆర్’ కు ‘దేవెగౌడ’ ఫోన్..!
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది.
- Author : Hashtag U
Date : 15-02-2022 - 7:38 IST
Published By : Hashtagu Telugu Desk
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సర్వత్రా మద్ధతు లభిస్తున్నది. ఈ మేరకు, మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) జాతీయ అధ్యక్షుడు హెచ్.డి. దేవెగౌడ సిఎం కెసిఆర్ పోరాటానికి తన సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. దేశంలో మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు సిఎం కెసిఆర్ ను అభినందించారు.ఈమేరకు మంగళవారం సిఎం కెసిఆర్ కు దేవెగౌడ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా దేవగౌడ మాట్లాడుతూ ‘‘ రావు సాబ్…మీరు అద్భుతంగా పోరాడుతున్నారు. మత తత్వ శక్తుల మీద ఎవరమైనా పోరాటాన్ని కొనసాగించాల్సిందే. దేశ లౌకికవాద సంస్క్రతిని, దేశాన్ని కాపాడుకునేందుకు మీమందరం మీకు అండగా వుంటాం… మీ యుద్దాన్ని కొనసాగించండి.. మా సంపూర్ణమద్దతు మీకు ఉంటుంది.’’ అంటూ దేవగౌడ తన మద్దతును ప్రకటించారు.కాగా …తాను త్వరలోనే బెంగళూరుకు వచ్చి సమావేశమౌతానని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, దేవెగౌడకు తెలిపారు.