Rape Case: యువతిపై అత్యాచారం ఆపై వీడియోలు లీక్
ఉత్తరప్రదేశ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాలికపై ఢిల్లీకి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి బాలిక అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు
- By Praveen Aluthuru Published Date - 07:47 AM, Mon - 11 September 23

Rape Case: ఉత్తరప్రదేశ్ కొత్వాలి ప్రాంతానికి చెందిన బాలికపై ఢిల్లీకి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడి బాలిక అభ్యంతరకర ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. తాను చెప్పినట్లు చేయాలనీ, లేదంటే చంపేస్తామని బాలికను బెదిరించాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కొత్వాలీ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయికి ఢిల్లీకి చెందిన అబ్బాయితో పరిచయం ఏర్పడింది. మొబైల్ ఫోన్ ద్వారా వీళ్లిద్దరి పరిచయం ఏర్పడింది. దీంతో రోజు మాట్లాడుకునేవారు. స్నేహం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి నిమిత్తం అతని తల్లిదండ్రులను కలవడానికి ఢిల్లీకి తీసుకెళ్లాడు, వెళ్ళినతర్వాత ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అనంతరం యువతిపై యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియోలు, ఫొటోలు కూడా తీసి వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.హోటళ్లకు తీసుకెళ్లి పలుమార్లు లైంగికంగా వేధించాడు. సహనం కోల్పోయిన యువతీ ఎదురు తిరిగింది. నిరసన వ్యక్తం చేయడంతో ఆమె వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చివరకి యువతీ తల్లిదండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు.
నిందితుడిపై అత్యాచారం, బెదిరింపు, ఐటీ సెక్షన్ల కింద నివేదిక నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సాహిబాబాద్ భాస్కర్ వర్మ తెలిపారు. బాలికకు వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
Also Read: Travel Sickness: ప్రయాణాల్లో వాంతులు ఆపడం కోసం అలా చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?